
1979లో ఆర్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన వెళ్లి రత్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కోవై సరళ అందులో చాలా చిన్న పాత్ర చేసిన మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూకట్టాయి. 1987లో మోహన్ బాబు నటించిన వీర ప్రతాపం సినిమాలో కూడా ఈమె నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కోవై సరళ మొదటి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక బ్రాండ్ ముద్రించుకుంది. .
ఇక ఇటీవల కాలంలో ఆమె సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎక్కువ అయిపోయారు.. మాలాంటి వాళ్ళకి ఆఫర్లు తగ్గిపోయాయంటూ వివరించింది. అలాగే ఆమె ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్తూ తన కుటుంబం తన అక్క, చెల్లెళ్ల కోసం పెళ్లి చేసుకోలేదని. అక్క, చెల్లెళ్ల అందరిని విదేశాల్లో సెటిల్ చేశానని వివరించింది. .
తను సంపాదించిన డబ్బు మొత్తం కుటుంబానికి ఖర్చు చేశానని.. మా సిస్టర్స్ పిల్లల కోసమే డబ్బు అంత ఖర్చయిపోయిందని.. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదని వివరించింది.. ఉన్న కొంత ఆస్తి కోసం కూడా ఇటీవల కుటుంబ సభ్యులు నాపై కోర్టులో కేసు వేశారు అని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.