సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే మూవీకి కమిట్ అయ్యేముందు ..తాను నటించిన సినిమా హిట్ అవ్వాలి అని.. మంచి కలెక్షన్స్ సాధించాలి అని ..మేకర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని కోరుకుంటూ ఉంటారు. తద్వారా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది . క్రేజ్ పబ్లిసిటీ కూడా పెరుగుతుంది . అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఊహించని విధంగా సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది.  ఫ్లాప్ అయిన సినిమా కూడా హ్యూజ్ కలెక్షన్స్ సాధిస్తే అది కూడా పరమ చెత్త నెగిటివ్ కామెంట్స్ అందుకున్న సినిమా సాధిస్తే .. ఇంకేముంది ఆ హీరో పేరు వేరే లెవెల్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది .


ఇప్పుడు ఆ హీరోకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . ఆయన ఎవరో కాదు మన తెలుగు హీరోనే.  టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటి సంపాదించుకున్న మహేష్ బాబు. మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే. ఆయన అందం ..ఆయన నటన ..ఆయన టాలెంట్..ఆయన నాటీనెస్..ఆయన చలాకితనం.. అబ్బబ్బ మిగతా హీరోలకి అలాంటి క్వాలిటీస్ లేవనే చెప్పాలి . కాగా గత సంవత్సరం సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' అనే సినిమా రిలీజ్ చేశారు మహేష్ బాబు.



ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ కధ  ప్రకారం మంచిగా అందుకోలేకపోయింది . ఈ సినిమా నెగటివ్ టాక్ దక్కించుకుంది . ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ కి నెగిటివ్ మార్కులు పడ్డాయి . ఈ సినిమా 76 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ 116 కోట్లపైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది . సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే మాత్రం కచ్చితంగా 250 కోట్లు ఈజీగా కలెక్ట్ చేసి ఉండేది . మొత్తానికి ఫ్లాప్ టాక్ తోనే 100 కోట్లు సాధించిన ఏకైక హీరోగా మహేష్ బాబు చరిత్ర లో నిలిచిపోయాడు. ప్రజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: