
రీసెంట్గా అమితాబచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్న ఈయన ఇదే విషయాన్ని స్వయంగా ఆయనతో పంచుకున్నాడు. నానా పటేకర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో గొప్ప సినిమాలో నటించిన నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు .. అలాగే నానా పటేకర్ మిలటరీ జీవితానికి కొత్త కాదు 1990ల లో తొలినాల్లో ప్రహర్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠ లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు .. అలాగే 1999లో కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు . ఆ తర్వాత వెంటనే ఆర్మీ లోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలని కోరికను తెలిపాడు .. అయితే అందుకు కేంద్ర రక్షణ మంత్రి పర్మిషన్ ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండిస్ కి ఫోన్ చేసి తను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయం చెప్పాడు .. దాంతో వెంటనే అనుమతి ఇచ్చారు. అలా 1999 ఆగస్టులో నానా పటేకర్ ఏకంగా రెండు వారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబటి దేశం కోసం కాపుల కాశాడు.
అలాగే అక్కడ సైనికులకు సాయం చేయడం గాయపడిన వారి కోసం బే స్ హాస్పిటల్ లో పనిచేయడం లాంటి పనులు కూడా చేశారు. అలాగే అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని శ్రీనగర్ కు వెళ్లినప్పుడు తాను 76 కిలోలు బరువు ఉండగా తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత నానా పటేకర్ మళ్ళీ తన సినీ జీవితాన్ని తిరిగి ప్రారంభించారు .. గత సంవత్సరం వన్వాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. అంతకన్నా ముందు విభిన్నమైన సినిమాల్లో నటించి నటుడుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . ఇలా ఒకపక్క కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా దేశం కోసం సేవ చేశాడు. మరొక దేశం గర్వించదగ్గ నటుడుగా ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని స్థానం దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడూ నానా పటేకర్ దేశం కోసం సైనికుడిగా సేవ చేశాడని ఈ విషయం తెలియడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నేటిజెన్లు.