
ఇక మరి ఈ సినిమా పక్క బోల్ట్ కంటెంట్తో తెరకెక్కితే ఈ సినిమాతో ఫస్ట్ టైం ప్రభాస్ కి కొత్త ఇమేజ్ ని ఇవ్వడమే కాకుండా ఆయనలోని కొత్త యాంగిల్ ని కూడా ప్రేక్షకులు చూడబోతున్నారు .. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ మూగవాడిగా నటించబోతున్నారని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ విషయం బయటికి రావటంతో సందీప్ రెడ్డి వంగ అభిమానులు ప్రభాస్ అభిమానులు సైతం తమ హీరోని మూగవాడిగా చూపిస్తున్నాడా అంటూ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే నిజానికి సినిమా మొత్తం ప్రభాస్ మూగవాడిగా నటించడం లేదు . ఈ సినిమాలో ఆయన అండర్ కవర్ పోలీస్ ఆపరేషన్ చేసినప్పుడు అందులో ఒక ఐదు నిమిషాలు పాటు మూగవాడిగా నటిస్తారట .. కొద్దిసేపు అలా ఏమి మాట్లాడకుండా మూగవాడిగా కనిపిస్తూ కొంతమంది క్రిమినల్స్ ను పట్టుకుని ఆ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇలా ఏదేమైనా కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో అంటే భారీ డైలాగులు చెప్పకపోయినా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు .. అలాగే హీరో కొన్ని పచ్చి బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు .. అవన్నీ హీరో నుంచి వచ్చినప్పుడే ఆడియన్స్ కి హై మూమెంట్ అయితే ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఈ సినిమాలో మూగవాడిగా నటించడం లేదు కానీ ఒక చిన్న సీన్‌లో మాత్రం అలా కనిపిస్తారని మాట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఇలాంటి క్రమంలో సందీప్ రెడ్డి వంగ , ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది చూడాలి.