
ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ - ఇప్పుడే "పా పా" మూవీ ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఈ చిత్రంలో హీరో హీరోయిన్స్ తో పాటు వారి బాబు పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకోవాలి. కొత్త ప్రొడ్యూసర్ నీరజ కోట గారికి "పా పా" చిత్రంతో ఘన విజయం దక్కాలి. సురేష్ కొండేటి ఏ సినిమా సక్సెస్ అవుతుందో బాగా గెస్ చేయగలడు. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు చెబుతున్నాం. అఖండ 2 టీజర్ చూశాను. ఫ్యాన్స్ కు పండగ అప్పుడే మొదలైన ఫీలింగ్ కలిగింది. అన్నారు.
దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ - మా సురేష్ కొండేటి ఎన్నో తమిళ మూవీస్ ను తెలుగులోకి తీసుకొచ్చారు. బడ్జెట్ లో చేసిన తమిళ చిత్రాలు కూడా తెలుగులో మంచి వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. "డా డా " సినిమా తమిళంలో 42 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే తెలుగులో "పా పా" పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ ఆకట్టుకుంది. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాత నీరజ కోట గారికి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా. మా నటసింహం బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నారు.
ప్రొడ్యూసర్ నీరజ కోట మాట్లాడుతూ - మా జేకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద చేస్తున్న ఫస్ట్ మూవీ "పా పా". ఈ చిత్రం తమిళంలో"డా డా " పేరుతో రిలీజై ఘన విజయాన్ని సాధించింది. అలాంటి విజయమే తెలుగు ప్రేక్షకులు కూడా మాకు అందిస్తారని కోరుకుంటున్నా. ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ కు వచ్చి సపోర్ట్ అందించిన డైరెక్టర్స్ కోదండరామిరెడ్డి గారికి, బి. గోపాల్ గారికి థ్యాంక్స్. అన్నారు.
ప్రొడ్యూసర్ నీరజ కోట భర్త శశికాంత్ మాట్లాడుతూ - మనుషులుగా మనం ఎంత ఆధునిక జీవితాన్ని సాగిస్తున్నా మనలోని హ్యూమన్ ఎమోషన్స్, విలువలు మారవు. అవి అలాగే ఉంటాయని చెప్పే చిత్రమిది. మేము ఈ చిత్రాన్ని తీసుకున్నాక...ఇండస్ట్రీలోని కొందరు పెద్ద మనుషుల నుంచి తమకు సినిమా ఇవ్వమని ఒత్తిడి చేశారు. ఆ ప్రెజర్ ను మాటల్లో చెప్పలేము. ఈ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన కూడా చేశాం. అయితే రీమేక్ చేస్తే ఒరిజినల్ మూవీలోని ఎమోషన్స్ పండవు అనిపించింది. ఒక మంచి హ్యూమన్ వ్యాల్యూస్, ఎమోషన్స్ ఉన్న చిత్రం "పా పా" అనేది మీడియా మిత్రులు ప్రేక్షకులకు తెలియజెప్పాలని కోరుతున్నా. అన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు