ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం ఏమిటంటే — సాయి పల్లవి లాగే కండిషన్స్ పెట్టే మరో హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చేసిందట! ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గాలివానలా వైరల్ అవుతోంది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు — కాంతారా ఫేమ్ రుక్మిణి వసంత్!. ఇప్పుడిప్పుడే ఒక్కసారిగా స్టార్ లెవెల్ కి ఎదిగిన రుక్మిణి వసంత్ ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంతారా చాప్టర్ వన్ సినిమా విడుదలైన తర్వాత ఆమె పేరు ప్రతి సినీ వర్గంలోనూ వినిపిస్తోంది. ఆ సినిమా రీలీజ్ తర్వాత ఆమెకు వరుసగా కొత్త ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కానీ, అందులో ప్రతి ఆఫర్‌ను ఆమె అంగీకరిస్తోందా? అసలు లేదు!రుక్మిణి కూడా ఇప్పుడు సాయి పల్లవి లాగా కొన్ని కఠినమైన కండిషన్స్ పెట్టుకుంటుందట. “నేను ఎలాంటి ఎక్స్పోజింగ్ సీన్స్ చేయను, రొమాంటిక్ లేదా బెడ్ సీన్స్ లో నటించను, నా పాత్రకు విలువ ఉండాలి — కేవలం హీరో కోసం గ్లామర్ టచ్ ఇవ్వడానికి మాత్రమే నటించను” అని ఆమె స్పష్టంగా చెప్పిందట. ఇది తెలిసిన తర్వాత ఇండస్ట్రీ వర్గాల్లో చాలా మంది షాక్ అయ్యారట.


ఇక సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఎప్పుడూ తన విలువలతో, తన సూత్రాలతో ముందుకు వెళ్లే నటి. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా, ఎన్ని కోట్ల ఆఫర్స్ ఇచ్చినా, సాయి పల్లవి తన కండిషన్స్ మీద ఎప్పుడూ రాజీ పడలేదు. రొమాంటిక్ సీన్స్ చేయకపోవడం, మేకప్ లేకుండా నటించడం, తన పాత్రకు డెప్త్ లేకుంటే రిజెక్ట్ చేయడం — ఇవన్నీ ఆమె ప్రత్యేకతలు. అదే మార్గంలో ఇప్పుడు రుక్మిణి వసంత్ నడుస్తోందట. ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ అయినా కూడా ఇలా తనకు తానే నిబంధనలు పెట్టుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది.



ఇక సోషల్ మీడియాలో మాత్రం జనం ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. “ఇదే కావాలి.. సాయి పల్లవి తరహా నాయికలు పెరగాలి”, “గ్లామర్ కోసం కాదు, టాలెంట్ కోసం సినిమాలు చేయాలి”, “రుక్మిణి లాంటి అమ్మాయిలే ఇండస్ట్రీకి రియల్ యాసెట్స్” అంటూ నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే “ఇదిగో.. మరో సాయి పల్లవి తయారయింది!” . పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే అంటూ పోస్టులు పెడుతున్నారు.ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — రుక్మిణి వసంత్ కూడా పాత్రను సైన్ చేసేముందు చాలా డిటైల్డ్‌గా స్టోరీ వింటుందట. ఆమె పాత్రలో ఎమోషన్ ఉందా, విలువ ఉందా, ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తుందా అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతుందట. ఆ కండిషన్స్‌ని ఒప్పుకోని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆఫర్స్ తీసుకెళ్తున్నారు కానీ రుక్మిణి మాత్రం తన స్టాండర్డ్స్ మీద నిలబడిపోతుంది. ఇక మొత్తానికి చెప్పాలంటే — సాయి పల్లవి తరహాలో తన విలువలు, కండిషన్స్, మరియు ప్యాషన్‌తో ముందుకు సాగుతున్న రుక్మిణి వసంత్... ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్‌గా నిలుస్తోంది. నిజంగా ఆమె ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో “న్యూ ఏజ్ సాయి పల్లవి” అనే టైటిల్ రుక్మిణి వసంత్ దే అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: