- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఇటీవ‌ల టాలీవుడ్‌లో మెగా హీరోల సినిమాలపై ఆస‌క్తిక‌ర‌మైన వార్త‌లు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ అప్‌డేట్స్ ఎంత నిజ‌మో తెలియ‌దు కానీ, అభిమానుల్లో మాత్రం భారీ ఎక్సైట్‌మెంట్‌ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, ప‌వ‌న్ కళ్యాణ్ ప్రాజెక్ట్స్ చుట్టూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొద‌ట చిరంజీవి - బాబీ కాంబినేషన్‌పై దృష్టి పెడితే, వాల్తేరు వీరయ్య త‌రువాత మ‌ళ్లీ ఈ జంట క‌లిసి ప‌నిచేయ‌నుంద‌ని టాక్‌. బాబీ రెడీ చేసిన ఈ కొత్త స్క్రిప్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గా రూపుదిద్దుకుంటోంద‌ట‌. ఈసారి కూడా కథలో రెండో హీరోకి ముఖ్యమైన స్థానం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం దర్శకుడు త‌మిళ స్టార్ కార్తీని సంప్రదిస్తున్నార‌ట‌. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో కార్తీ పాత్రకు కూడా బలమైన షేడ్స్ ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.


నిజంగా కార్తీ చేరితే ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో పెద్ద హైప్‌ క్రియేట్ అవుతుంది. ఇక రామ్ చ‌ర‌ణ్ వైపు వెళ్తే, ఆయన బుచ్చిబాబు సినిమా పూర్త‌య్యాక నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయ‌నున్నాడ‌న్న వార్త బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి అనిరుథ్ సంగీతం అందించ‌నున్నాడ‌ని టాక్‌. అసలైన ప్లాన్ ప్రకారం బుచ్చిబాబు తర్వాత సుకుమార్ సినిమా ఉండాలి, కానీ సుకుమార్ కథను పూర్తిగా రెడీ చేయడానికి ఇంకా సమయం పడుతుండటంతో చ‌ర‌ణ్ మధ్యలో ఒక ఫాస్ట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడట‌. నెల్సన్ ప్రస్తుతం జైలర్ 2లో బిజీగా ఉన్నప్పటికీ, అది పూర్తయిన వెంటనే చ‌ర‌ణ్ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్‌.


ఇవి పక్కన పెట్టితే, డైరెక్టర్ మెహర్ రమేష్ గురించిన ఒక వార్త మాత్రం ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురి చేస్తోంది. అతను త్వరలో ఓ మెగా హీరోతో సినిమా చేయవచ్చని, ఆ హీరో పవన్ కళ్యాణ్ లేదా రామ్ చరణ్ కావచ్చని సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే ‘భోళా శంకర్’ డిజాస్ట‌ర్ అయ్యాక మెహర్ రమేష్‌పై ఫ్యాన్స్ నమ్మకం కోల్పోయారు. గతంలోనూ ఆయన కొన్ని సినిమాలతో నిరాశపరిచాడు. అలాంటి పరిస్థితిలో మళ్లీ ఒక స్టార్ హీరో ఆయనకు ఛాన్స్ ఇవ్వడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఏదేమైనా ఈ ప్రాజెక్టుల‌పై మెగా క్యాంప్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటనలు వస్తే, ఆ ఆసక్తి మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: