మూడు రోజులు ఆగి జనవరి 12న మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వం, నయనతార జోడీ, హ్యూమర్ మసాలా మిక్స్‌తో ఈ సినిమా పండుగ రష్‌లో హైలైట్‌గా నిలవొచ్చు. ఇప్పటికే ఏరియాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు చెల్లించేశారు. తర్వాత రోజు జనవరి 13న మాస్ మహారాజ రవితేజ ‘ భర్త మహాశయులకు విజ్ఞప్తి ’ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. కామెడీ టచ్‌తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా మిడ్ - రేంజ్ ఆడియన్స్‌కి బాగా నచ్చే అవకాశం ఉంది. జనవరి 14న యువ హీరో నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, చివరగా శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి’ తో సంక్రాంతి బరిలో అడుగు పెట్టనున్నారు.
తమిళ స్టార్ విజయ్ జన నాయకుడు’ ను ప్రభాస్ రాజాసాబ్‌కు పోటీగా అదే రోజు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో శివకార్తికేయన్ ‘పరాశక్తి’ ని పొంగల్ సీజన్‌కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్త క్లాష్ వల్ల థియేటర్ కేటాయింపుల విషయంలో బయ్యర్లకు, ఎగ్జిబిటర్లకు తీవ్ర టెన్షన్ నెలకొంది. ఏపీ, తెలంగాణలో థియేటర్లు తగినంత ఉన్నా, చిన్న పట్టణాలు, బి, సి సెంటర్లలో స్క్రీన్లు పరిమితంగా ఉండటంతో అన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేయడం కష్టమే. ఆడియన్స్‌కి ఆప్షన్లు ఎక్కువ కావడంతో ఓపెనింగ్స్, వసూళ్లు కూడా ప్రభావితం కావొచ్చు. అందుకే ఎవరు వెనక్కి తగ్గుతారు, ఎవరు నిలబడతారు అనేది చూడాల్సిందే. ఈసారి సంక్రాంతి క్లాష్ టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో రికార్డ్ స్థాయిలో హడావిడిగా మారబోతోందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి