ఇటీవల వరసగా సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది తాజాగా ఒక షోలో చేసిన కామెంట్స్ చాలా వివాదాస్పరంగా మారుతున్నాయి. ప్రముఖ సీరియల్ నటిగా పేరుపొందిన బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య (దీపిక) ను హైపర్ ఆది బండ ఆంటీ అంటు బాడీ షేమింగ్ కామెంట్లు చేయడంతో అభిమానులు , నెటిజెన్స్ సైతం తీవ్రస్థాయిలో హైపర్ ఆది మీద ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఢీ డాన్స్ షో కి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేయగా ఈ ప్రోమోలో ఢీ షోలో కెమెరా మాన్ తో కలిసి డాన్స్ చేసింది కావ్య.
అయితే ఈ డాన్స్ ఫన్నీగా సాగినప్పటికీ ఆ తర్వాత హైపర్ ఆది లేచి మీరు పర్మిషన్ ఇస్తే తాను డైరెక్టర్ గా వెళ్లి వారిద్దరిని పెట్టి గుండు అంకుల్ బండ ఆంటీ అని ఒక సినిమా తీస్తానంటూ కామెంట్స్ చేశారు. దీపిక కొంతమేరకు అసహనాన్ని తెలియజేస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ కామెంట్స్ పైన కొంతమంది బిన్న అభిప్రాయాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి బాడీ కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కావ్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇందుకు సంబంధించిన ప్రోమో అయితే వైరల్ గా మారింది. మరి విషయంపై హైపర్ ఆది ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి