విజువల్ పరంగా ఈ పాటకు సినిమాటోగ్రఫీ ఓ కొత్త స్థాయిలో ఉంది. కేరళలోని అద్భుతమైన లొకేషన్లు, ప్రకృతి సోయగాలను సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ మంత్ర ముగ్ధుల్ని చేసేలా చూపించారు. ప్రతి ఫ్రేమ్ ఒక ఫోటోలా, ప్రతి షాట్ ఒక భావపూర్ణ కవితలా అనిపిస్తుంది. ఈ పాట చూస్తున్నప్పుడు మనమే కేరళలో పచ్చని అరణ్యాల్లో, వర్షపు చినుకుల్లో విహరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.అనిల్ ఇనమడుగు – వేణి రావు లవ్ జంట స్క్రీన్ మీద చాలా సహజంగా, ఎలాంటి వల్గారిటి లేకుండా నటించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి చేరి, వన్ మిలియన్ వ్యూస్ మార్క్ దాటింది. పెద్ద పెద్ద స్టార్స్ నటించిన వీడియోలతో సమానంగా “ఏమి మాయ ప్రేమలోనా”కి వచ్చిన స్పందన పరిశ్రమ మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ ఆల్బం ను అక్కి వర్క్స్ బ్యానర్ లో, నిర్మాతలు అజయ్ కుమార్ మరియు విష్ణు పాదర్తి ఎంతో శ్రద్ధతో నిర్మించారు. తక్కువ బడ్జెట్‌లోనూ ఉన్నతమైన క్వాలిటీతో, హృదయాన్ని తాకే రీతిలో రూపొందించిన ఈ ఆల్బమ్ ఇప్పుడు ప్రతి యువకుడి ప్లే లిస్టులో చోటు సంపాదిస్తోంది.ముఖ్యంగా ఈ పాట యువతను ఒక కొత్త రొమాంటిక్ వైబ్స్‌లోకి తీసుకెళ్లే శక్తి కలిగింది. ప్రేమ అంటే కేవలం మాటలతో కాదు, మనసుతో అనుభవించాల్సిన భావమని ఈ ఆల్బమ్ మనకు గుర్తు చేస్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే —“ఏమి మాయ ప్రేమలోనా” అనేది భావోద్వేగాలకు, ప్రేమకు, సౌందర్యానికి, సహజత్వానికి సమ్మేళనం. దర్శకుడు అనిల్ ఇనమడుగు దర్శకత్వం, శ్రవణ్ సినిమాటోగ్రఫీ, సింగర్స్ యొక్క మెలోడీ, హీరో–హీరోయిన్ల సహజమైన నటన — ఇవన్నీ కలిపి ఈ ఆల్బమ్‌ను ఓ మంత్రముగ్ధమైన అనుభూతిగా మలిచాయి.ఈ పాటను చూసిన తర్వాత ఒక్క మాట మాత్రమే గుర్తుకొస్తుంది —“ప్రేమ అంటే ఇదే కదా… ఏమి మాయ ప్రేమలోనా!”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి