ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇది పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా నాని అభిమానులు ఈ వార్త విన్నాక నిద్రపట్టడం లేదు.బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్‌తో తన కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న నాని, ప్రస్తుతానికి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్‌కి కమిట్ అయినట్టు సమాచారం. సుజిత్ ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందించిన “ఓ.జి.” సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి హైప్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా తర్వాత ఆయన ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడా అనే విషయం గురించి సినీ వర్గాలంతా ఆసక్తిగా ఎదురుచూశాయి.

అప్పుడు ఆ లక్కీ ఛాన్స్ నానికి దక్కిందని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కూడా “ఓ.జి యూనివర్స్” లో భాగంగా ఉండబోతోందని సమాచారం వినిపించింది. అయితే దీనిపై సుజిత్ గానీ, నాని గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.



ఇదిలా ఉండగా, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయినట్టు వార్తలు వచ్చాయి. నాని అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే నానిసుజిత్ కాంబినేషన్ అనగానే కథ, ట్రీట్మెంట్, మేకింగ్ అన్నీ కొత్త రేంజ్‌లో ఉండబోతాయని అందరూ అనుకున్నారు.

కానీ, అకస్మాత్తుగా ఈ సినిమా ఆగిపోయిందని, లేదా హోల్డ్‌లోకి వెళ్లిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించడం మొదలైంది. దానికి కారణం నాని బిజీ షెడ్యూల్‌నేనట. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో, సుజిత్సినిమా కోసం ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుందట.

అంత టైం వెయిట్ చేయడం ఇష్టం లేక సుజిత్ ఈ మధ్య గ్యాప్‌లో మరొక పెద్ద హీరోతో కొత్త సినిమా చేయడానికి కమిట్ అయ్యాడట. దీంతో కొంతమంది “నాని సినిమా పూర్తిగా ఆగిపోయింది” అని చెబుతుంటే, మరికొంతమంది “అది ఆగలేదు, కేవలం హోల్డ్‌లోకి వెళ్లింది. నాని ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక తిరిగి ఆ ప్రాజెక్ట్‌ను మొదలుపెడతారు” అని అంటున్నారు.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నానితో సినిమా చేయబోతున్నాడని వార్త బయటకు వచ్చినప్పుడు పలువురు స్టార్ హీరోలు కూడా ఆ లక్కీ ఛాన్స్ తమకు రాలేదని కొంత నిరాశ వ్యక్తం చేశారని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని తెలిసి, “ఇప్పుడు మా కళ్ళు చల్లబడ్డాయి” అంటూ కొందరు ఘాటు ట్రోల్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా, నానిసుజిత్ కాంబినేషన్‌లో సినిమా వస్తే అది ఖచ్చితంగా భారీ అంచనాలు రేపే ప్రాజెక్ట్ అవుతుందని మాత్రం ఎవరూ ఖండించలేరు. ఇప్పుడు ఆ సినిమా నిజంగా నిలిచిపోయిందా, లేక హోల్డ్‌లో ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన రాక తప్పదు. అప్పటివరకు మాత్రం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండింగ్‌లోనే కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: