నటసింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న తెలుగు సినీ వర్గాల్లో. . సినీ లవర్స్‌లో .. ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ అయితే మామూలుగా లేదు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా అఖండ 2 సినిమా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రు. 250 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. టిక్కెట్ రేట్ల హైక్ .. ప్రీమియర్ షోలు ఇవన్నీ ఉంటే తప్పా ఈ సినిమాకు ఆ స్థాయిలో వసూళ్లు రావు. సినిమా కు మరీ అదిరిపోయే టాక్ రావాల్సి ఉంటుంది. దీనికి తోడు టిక్కెట్ రేట్లు భారీగా హైక్ ఉండాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీమియర్ షోల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు మేకర్స్ ఒక భారీ రేటును ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఒక్కో టికెట్ కు రూ. 600 ఉండేలా ప్రభుత్వాలకు సినిమా మేకర్స్ దరఖాస్తులు చేసుకున్నట్టు సమాచారం. గతంలో కొన్ని సినిమాలకు ప్రీమియర్స్ రేట్లు 1000, 1500 లకు పెంచుకున్నారు. అయితే అంత భారీగా రేట్లు పెంచడానికి బాలయ్య ఒప్పుకోవడం లేదు. అందుకే రు. 600 టిక్కెట్ రేటు ప్రీమియర్ కు నిర్ణయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ రేటు ఫిక్స్ అయితే ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో బాలయ్య బాబు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం ఖాయం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి