టాప్ హీరోల సినిమాలకు కథలు అందించే స్టార్ రైటర్ గా పేరుగాంచిన కోనవెంకట్ హవా మసక బారడంతో ప్రస్తుతం నిర్మాతగా మారి సక్సస్ ను అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తన మొదటి ప్రయత్నం ‘గీతాంజలి’ తో సక్సస్ ను అందుకున్నా ఆతరువాత ఇతడు నిర్మాణం సారధ్యం వహించిన సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి. 
 దాన్ని ఎవరూ ఆపలేరు
దీనితో లేటెస్ట్ గా కోన వెంకట్ నిర్మాతగా మారి తీసిన 'నీవెవరో’ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఈమూవీకి కూడ ఫెయిల్యూర్ టాక్ రావడంతో నిరాశలోకి వెళ్ళిపోయిన కోనవెంకట్ ఈమూవీ పరాజయాన్ని పూర్తిగా అంగీకరించకుండా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన ఈమూవీ థాంక్యూ మీట్ లో చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. 
అలా చేయడం సరికాదు
ఒక కథను నమ్మి సినిమా మొదలుపెట్టినప్పుడు తీసేవాళ్ళు చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. కానీ మధ్యలో వ్రాసేవాళ్ళు ఎవరు అంటూ ఈమూవీ పై నెగిటివ్ రివ్యూలు వ్రాసిన మీడియా పై తన ఆవేదనను బయటపెట్టాడు కోనవెంకట్. ఒక సినిమాను తీస్తున్నప్పుడు కీర్తితో పాటు డబ్బును కూడ ఆసిస్తామని కొన్ని వంద‌లు మంది వేలగంట‌లు ప‌నిచేస్తే ఒక సినిమా వ‌స్తుంది అంటూ అలాంటి ఒకసినిమా పై ప‌ది రూపాయ‌ల పెన్‌ తో విమర్శలు రాయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నాడు కోనవెంకట్.  
 అందుకే ఇటు వైపు
ఎవరు ఎన్ని కామెంట్స్ వ్రాసినా ప్రేక్షకుల తీర్పు అంతిమం అనిచెపుతూ ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో ఫంక్షన్లో చెప్పిన మాటలను గుర్తుకుచేసాడు. ‘మీకు సినిమాలు నచ్చేంత వరకు చేస్తూనే ఉంటానని’ జూనియర్ అప్పట్లో అన్నమాటలను రిపీట్ చేస్తూ ప్రేక్షకులకు నచ్చేవరకు సినిమాలు తాను తీస్తూనే ఉంటాను అని కోనవెంకట్ ‘శపదం’ చేసాడు. అయితే వరస ఫెయిల్యూర్స్ ఎదురైతే మెగా సినిమాలు తీసిన భారీ నిర్మాతలే ఇప్పుడు అజ్ఞాతవాసం చేస్తున్న నేపధ్యంలో జనం మెచ్చుకోని సినిమాలు తీసి ఎంతకాలం కోనవెంకట్ నిర్మాతగా కొనసాగ గలడు అన్నదే సందేహం..    



మరింత సమాచారం తెలుసుకోండి: