తెలుగు ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ‘దేవదాసు’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా.  మొదటి చిత్రంతోనే తన అందచందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది.  ఈ అమ్మడి నడుం వంపు సొంపులకు ఆడియన్స్ మాత్రమే కాదు దర్శక, నిర్మాతలు కూడా ఫిదా కావడంతో వరుసగా ఛాన్సులు ఇవ్వడం మొదలు పెట్టారు.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటిస్తూ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిపోయింది. 
Related image
తెలుగు లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  నాజూకు నడుముకు అసలైన అర్ధాన్ని చెప్పిన ఇల్లి బాలీవుడ్ కి వెళ్ళాక చాలా మారిపోయింది.  అక్కడు కొన్ని చిత్రాల్లో నటించింది..కానీ పెద్దగా సక్సెస్ మాత్రం సాధించలేదు.  ఇక చాలా రోజుల తరువాత అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి కనిపించిన ఈ బ్యూటీ పెద్ద షాకె ఇచ్చింది.  ఒకప్పుడు సన్నగా అందమైన నడుం వొంపు సొంపులతో ఉన్న ఇలియానా కాస్త బొద్దుగా కనిపించింది. 

ఇక రీసెంట్ గా ఇల్లి తగ్గడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ లో టాక్ వచ్చినప్పటికీ మళ్ళీ అదే లుక్ తో కనిపిస్తోంది.  ఈ మద్య ఇలియాన ఓ స్టిల్ పోస్ట్ చేసింది. మరోసారి తన నడుం వొంపులతో కిక్ ఇస్తున్నట్లుంది ఆ హాట్ పిక్. దాంతో నెటిజన్లు అదే లుక్కా కొంచెం తగ్గాలమ్మా అంటూ సౌత్ ఆడియెన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇకపోతే మరికొందరేమో ఈ చబ్బీ అందాలే కొత్తగా ఉన్నాయంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: