కళ్యాణ్ రామ్, నివేదా థామస్, సినిమాటోగ్రఫీకళ్యాణ్ రామ్, నివేదా థామస్, సినిమాటోగ్రఫీస్క్రీన్ ప్లే, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ
గౌతం (కళ్యాణ్ రాం) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్.. తన పని తాను చేసుకు వెళ్తున్న అతనికి ఓ కల వస్తుంది. అందులో ఓ అమ్మాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేస్తారు. ఇంకా ఆ కలలో ఓ కారుని చెరువులో పడేసినట్టు వస్తుంది.  ఇలా తనకు వచ్చిన కల గురించి ఆలోచిస్తూ ఉండగా కలలో వచ్చిన రియల్ లొకేషన్ తన కంటపడటంతో కలలో జరిగింది నిజమే అని దాన్ని కనిపెట్టే ప్రయత్నం మొదలు పెడతాడు గౌతం. ఈ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలేంటి..? అసలు ఆ కలలో అమ్మాయి ఎవరు..? అతనికి గౌతం కు ఏంటి సంబంధం అన్నది మిగతా సినిమా వెండితెరపై చూడాల్సిందే..  



గౌతం పాత్రలో కళ్యాణ్ రాం బాగా చేశాడు. పాత్రకు తగినట్టుగా తన నటన ఉంది. కొన్ని సీన్స్ లో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక షాలిని పాండే కూడా హీరో లవర్ గా బాగానే చేసింది. నివేదా థామస్ సినిమాలో ప్రధాన పాత్ర చేసింది. పర్ఫార్మెన్స్ ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో నివేదా తన పాత్రకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది. నాజర్, రాజీవ్ కనకాల, ప్రభాస్ శ్రీను ఇలా అందరు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. విలన్ రోల్ చాలా తక్కువే అతను జస్ట్ ఓకే అనిపించాడు. 



కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్ గా తన ప్రతిభ చూపించాడు. దర్శకుడు అతనే కావడం వల్ల తనకు ఎలాంటి ఫ్రేమింగ్ కావాలో బాగా చూపించాడు. కళ్యాణ్ రాం ఇదవరకు సినిమాల కన్నా ఈ సినిమాలో బాగున్నాడు. అయితే కథ, కథనాల విషయంలో దర్శకుడు డీటైల్స్ మిస్ అయ్యాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా నడిపించా ల్సిన కథను మధ్యలో ట్రాక్ తప్పాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం ఆకట్టుకుంది. 



కొన్ని కథలు రాసుకున్నప్పుడు బాగా ఉంటాయి. అయితే అవి తెర మీదకు వచ్చేసరికి తేడా కొడతాయి. 118 సినిమా కథగా చెబితే చాలా బాగుంటుంది. అయితే ఆ కథను దర్శకుడు తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. మొదటి నుండి చివరి దాకా సినిమాకు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ కాలేదు.


మొదటి భాగం అంతా వేగంగా నడిపించినా సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. ఉన్నంతవరకు సినిమా బాగానే చేశాడు. కళ్యాణ్ రాం, నివేదాల పర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడతాయి. అయితే డిఫరెంట్ జానర్ ఆశించే ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చుతుంది.


ఫ్లాష్ బ్యాక్ రొటీన్ అవడం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. ఇక కలలోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే సీన్స్ కొన్ని నమ్మశక్యంగా అనిపించవు.



కళ్యాన్ రామ్, నివేదిత థామస్, షాలినీ పాండే,కెవి గూన్,మహేష్ ఎస్ కోనేరు,శేకర్ చంద్ర 118.. అంతా కలలానే ఉంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: