టాలీవుడ్ లో యాక్షన్ హీరో అర్జున్ అంటే మంచి క్రేజ్ ఉంది.  మన్నెంలో మొనగాడు సినిమా దగ్గర నుంచి ఇటీవల రిలీజ్ అయిన అభిమన్యుడు వరకు అక్షయ్ కుమార్ ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు.  ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ మద్య విలన్ గా కూడా నటిస్తున్నారు.  మంచి పాత్రలు ఏవైనా సరే తనకు నచ్చితే చేయడమే అంటున్న అర్జున్ తాజాగా మరో కోలీవుడ్ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించబోతున్నారు. 
Image result for action hero arjun
ఇక డాక్టర్ సలీం, నఖిలీ, బిచ్చగాడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న విజయ్ ఆంటోని ఈ మద్య ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తున్నాడు. అయిన‌ప్ప‌టికి ఓటమికి వెనుక‌డుగు వేయ‌కుండా వ‌రుస సినిమాల‌తో దూసుకెళుతున్నాడు.  బిచ్చగాడు తర్వాత బేతాళుడు,యమన్, ఇంద్రసేన లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇటీవల కాశీ అనే మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తెలుగులో కాశీ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా తమిళంలో కాళి పేరుతో విడుద‌లైంది.
Image result for vijay antony
ఈ సినిమా రెండు భాషల్లోనూ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్ర‌స్తుతం కొలైకార‌న్ అనే టైటిల్‌తో తెరకెక్క‌నున్న మూవీలో న‌టిస్తున్నాడు. ఆండ్రూ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. దియా మూవీస్‌ బ్యానరులోని ఈ సినిమాలో అర్జున్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.  ఈ సినిమాలో ఆషిమా నర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నాజర్‌, సీత, వీటీవీ గణేశ్‌లు నటిస్తున్నారు. ఇందులో విజ‌య్ ఆంటోని నెగెటివ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: