‘మహర్షి’ సూపర్ సక్సస్ టాక్ తెచ్చుకోవడంతో జోష్ లో ఉన్న నమ్రత ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మహర్షి’ ఫస్ట్ షో టాక్ తెలిసే వరకు తాను పడ్డ టెన్షన్ ను వివరించింది. మహేష్ కెరియర్ కు సంబంధించి ‘మహర్షి’ ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఆమూవీ ఫస్ట్ టాక్ తెలిసే వరకు కొద్ది సేపు తన చేతి గోళ్ళను తన నోటితో కొరుక్కుంటూ మరి కొద్ది సేపు తన ఇంటిలోని దేవుడు గదిలోకి వెళ్ళి ప్రార్ధించిన సందర్భాన్ని బయట పెట్టింది.

ఇలా నిన్న తెల్లవారుజామున నుండి తాను పడుతున్న టెన్షన్ ను చూసి మహేష్ కూల్ గా ఉండమని ఎన్ని సార్లు చెప్పినా తాను కూల్ గా ఉండలేకపోయిన విషయాన్ని వివరించింది. అంతేకాదు మహేష్ కుటుంబ సభ్యులు అంతా ‘మహర్షి’ ప్రీమియర్ షోలను చూడడానికి ఇష్టపడితే తాను ‘మహర్షి’ టాక్ తెలిసే వరకు ఆసినిమా ధియేటర్ల వంక వెళ్ళే సాహసం కూడ చేయలేకపోయిన విషయాన్ని షేర్ చేసింది. 

అంతేకాదు మహేష్ నటించే ప్రతి సినిమా రిలీజ్ రోజునా తన పరిస్థితి అలాగే మారుతోందనీ మహేష్ సినిమాలను మొదటిరోజున జనం మధ్య కూర్చుని చూసేంత ధైర్యం తనకు లేదు అంటూ కామెంట్స్ చేసింది. ఇదే సందర్భంలో ఆమె మహేష్ తో తన జీవితప్రయాణాన్ని గురించి వివరిస్తూ మహేష్ ను పెళ్ళిచేసుకోవడం కోసం తాను 5 సంవత్సరాలు ఎదురు చూసిన నేపధ్యంలో తనకు టెన్షన్స్ అలవాటైపోయాయి అని జోక్ చేసింది. 

వాస్తవానికి తాను మహేష్ ప్రేమలో పడే ముందు బాలీవుడ్ టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ అనీల్ కపూర్ సంజయ దత్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ మహేష్ ను పెళ్ళి చేసుకోవడం వల్ల తన కెరియర్ వదులు కున్నాను అన్న ఫీలింగ్ తనకు ఎప్పుడు ఏర్పడలేదు అని కామెంట్స్ చేసింది నమ్రత. ఇదే సందర్భంలో ఆమె మరొక ట్విస్ట్ ఇస్తూ మహేష్ సినిమాల విషయంలో తన సలహా సంప్రదింపులు ఉంటాయి అంటూ వస్తున్న వార్తల పై స్పందిస్తూ మహేష్ కనిపించని మొండి మనిషి అనీ ఒకసారి మహేష్ స్థిర నిర్ణయం తీసుకున్న తరువాత దానిని మార్చే శక్తీ తనకు కూడ లేదు అంటూ నమ్రత మహేష్ స్వభావాన్ని బయటపెట్టింది..     



మరింత సమాచారం తెలుసుకోండి: