తమన్నా.. మిల్కి బ్యూటీ.. కెరీర్ స్టార్టింగ్ చేసిన రోజుల్లో టాప్ హీరోలతో సినిమాలు చేసింది. కెరీర్ డల్ అవుతుంది అనుకుంటుండగా... బాహుబలిలో అవకాశం వచ్చింది.  సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇంకేముంది అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అనుకుంది.  ఏవో కొన్ని వచ్చాయిగాని పెద్దగా ఉపయోగం లేదు. 

అటు బాలీవుడ్ కు వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్నా లాభం లేదు. తెలుగులో చేసిన ఎఫ్ 2 సినిమా హిట్టయినా స్ట్రెయిట్ సినిమాలు లేవు.  ప్రభుదేవా తో కలిసి చేసిన అభినేత్రి 2 సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.  ఇప్పుడు ఈ అమ్మడి చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉన్నది.  అది రీమేక్ సినిమా.  


2017 లో తాప్సి మెయిన్ రోల్ చేసిన ఆనందో బ్రహ్మ అనే హర్రర్ కామెడీ సినిమా సూపర్ హిట్టైంది.  ఈ సినిమాను ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో తమన్నాను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. అదే కంగల్ సినిమా దర్శకుడు రోహన్ వెంకటేసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  


అటు తమిళంలో నయనతార హీరోయిన్ గా చేసిన హర్రర్ మూవీ కొలైయుతీర్ కాలం సినిమా రీమేక్ కామోషిలో తమన్నా హీరోయిన్.  బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్నది.  
టాలీవుడ్ లో ఎఫ్ 2 తరువాత ఆమెకు స్ట్రెయిట్ సినిమాలు లేకపోవడం విశేషం.  తెలుగులో ఈ మిల్కి బ్యూటీ ఎప్పుడు స్ట్రెయిట్ మూవీ చేస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: