పదహారేళ్ళ వయసులో సిరిమల్లే పూవా అంటూ శ్రీదేవి అమాయకంగా పాడుతూంటే పులకించని హ్యుదయం లేదుగా. లేత అందాలతో పరువం పదనిసలు పలుకుతూంటే వినని వారే లేరుగా. శ్రీదేవి అంటే ఒకటి చెబుతారు. అప్సరస దివి నుంచి భువికి దిగి వచ్చి మనకోసం కొన్నాళ్ళు అందంగా ఆనందంగా ఇలలో   విహరించి తిరిగి తనలోకాలకు వెళ్ళిపోయిందని.


మరి ఆ అతిలోకసుందరి కూతురు అంటే తల్లి అందం తప్పకుండా పుణికిపుచ్చుకుంటుందిగా. జాన్వీ కపూర్ కూడా అమ్మ కూతురుగా సొగసులు సిరులతో కుర్రకారు గుండెలను చిదిమేస్తోస్తోంది. జాన్వీ కపూర్ ర్ ఇప్పటికే బాలీవుడ్ లో ధఢక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చేసింది. మొదటి సినిమా సక్సెస్ అవటమే కాక, సోషల్ మీడియాలో అమ్మడికి ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఏర్పడింది.



ఇక బాలీవుడ్ లో ప్రతి కెమెరా కన్ను జాన్వీ కపూర్ మీదే. ఆమె జిమ్ కి వెళ్లినా, డిన్నర్ కి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా ఆమెనే ఫాలో అవుతూ ఉంటుంది బాలీవుడ్ మీడియా.  నిన్నటి వరకు పొట్టి నిక్కర్లు, పొట్టి డ్రెస్ లతో తొడలు ఎక్స్పోజ్ చేస్తుంది అంటూ గుండెలు బాదుకున్న బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ట్రాన్సపరెంట్ డ్రెస్ లో ఎద అందాలను ఎక్స్పోజ్ చేస్తూ మరో షాకిచ్చింది. అమ్రి హార్ట్ అటాక్ వూరికే రాదు కదా. అయినా నాదేం తప్పు అంటోందిట ఆ అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: