జూలై మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘ఓ బేబీ’ మూవీని చాల ముందుగానే సమంత ప్రమోట్ చేస్తూ ఆమూవీ పై అంచనాలు పెంచడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించి సమంత తీసుకున్న యూటర్న్ పై ఇప్పుడు ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే విడుదలైన ఈమూవీ టీజర్ కు మంచి స్పందన వచ్చినా ఆ టీజర్ లో సమంత తన పాత్రకు చెప్పుకున్న డబ్బింగ్ ఆమెకే నచ్చలేదని తెలుస్తోంది. దీనికితోడు ఈమూవీ ఫైనల్ కాపీ చూసిన తరువాత సమంత తన పాత్రకు చెప్పుకున్న డైలాగులలో తమిళ స్లాంగ్ కనిపించడంతో సమంత షాక్ అయి తన ఆత్మ చిన్మయిని రంగంలోకి దిపుతున్నట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు చిన్మయి గత రెండు రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటూ ‘ఓ బేబి’ లోని సమంత పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలకు సమంత సరిపోతుంది అని చెప్పడానికి ‘ఓ బేబి’ విజయం అత్యంత కీలకం కావడంతో ఈమూవీ విషయంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా సమంత అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

‘మజిలీ’ సూపర్ సక్సస్ తరువాత సమంత నటించిన సినిమా కావడంతో ‘ఓ బేబీ’ కి మార్కెట్ పరంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ మాత్రం సమంత స్టామినా పై ఆధారపడి ఉంటాయి. దీనితో సమంత సినిమాలకు హీరోలు లేకపోయినా కలక్షన్స్ వస్తాయి అన్న విషయం రుజువు కావాలి అంటే ఖచ్చితంగా ‘ఓ బేబి’ సక్సస్ సాధించి తీరాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: