రాజకీయాలు వేరు.. సినిమా వేరు... రాజకీయాల్లో రాణించిన చాలా మంది సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉన్నట్టుగా ఎక్కడా లేదు.  ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే.. సినిమాల్లోనూ ఉన్నారు.  సినీ రంగంలో రాణించారు.  సినీ జీవితం నుంచి వచ్చిన వ్యక్తులు కావడంతో తిరిగి సినిమాల్లో నటించడం పెద్ద విశేషం కాదు.  


పవన్ జనసేన పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యాక.. తిరిగి సినిమాల్లోకి వస్తారని అనుకుంటే.. అందుకు పవన్ ససేమిరా అంటున్నారు.  రాజకేయాల్లోనే ఉంటాను గాని సినిమా రంగంలోకి వచ్చే ప్రసక్తి లేదని అంటున్నాడు.  ఇలా ఎందుకు అంటున్నాడు అనే విషయం తెలియడంలేదు.  


గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేసిన తరువాత కూడా సినిమాలు చేశారు.  మెగాస్టార్ చిరంజీవి సైతం రాజకీయాల తరువాత తిరిగి సినీ రంగంలోకి వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి.  అంతెందుకు బాలకృష్ణ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తున్నాడు.  


అయితే, ఇక్కడ ఒకటే చిక్కు వచ్చింది.  తిరిగి సినిమాల్లోకి వస్తే పార్ట్ టైం పొలిటీషియన్ అనే ఎక్కడ అంటారో అని పాపం పవన్ ఇబ్బందులు పడుతున్నాడు.  ఎం జరుగుతుందో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: