ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. కిరాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న రష్మిక ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. తెలుగులో చలో, గీతాగోవిందం సినిమాలతో సక్సెస్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో చాలా హాట్ గా నటించింది.

Image result for mahesh rashmika

లిప్ లాక్ ముద్దుల తో రెచ్చిపోయింది. ఇటువంటి క్రమంలో ఇండస్ట్రీలో ఇన్ని విజయాలు సాధిస్తున్న రష్మిక సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. మహేష్ సినిమా కోసం కోలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన తమిళ సినిమాను పక్కన పెట్టేసింది. తెలుగుతో పాటుగా తమిళ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రష్మిక, ఇళయదళపతి విజయ్ సినిమా ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

Image result for mahesh rashmika

అయితే అంతకన్నా ముందు శివ కార్తికేయన్ డైరక్షన్ లో సినిమా ఛాన్స్ వచ్చింది. కార్తితో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న రష్మిక శివ కార్తికేయన్ సినిమాకు మాత్రం హ్యాండ్ ఇచ్చిందట. విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి రష్మిక తప్పుకుందట. ఈ సినిమా నుండి రష్మిక తప్పుకోడానికి ముఖ్య కారణం మహేష్ సినిమానే అంటున్నారు. మొత్తం మీద ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. మొత్తం మీద మహేష్ బాబు సినిమా కోసం తమిళ సినిమాను పక్కనపెట్టేసింది సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక.



మరింత సమాచారం తెలుసుకోండి: