సాధారణంగా కర్రసాము అనేది ఒక విద్య... దీనిని ఎవరైనా నెర్చుకోవచ్చు. దక్షిణ భారత దేశంలో ఇది తెలియని వారు ఉండరు. ఈ కర్రసాముకు ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల కర్రసాముతో తమ సామార్థ్యాన్ని నిరూపించుకుంటారు. పాతకాలం నుండి ఉన్న ఈ విద్యను చిత్రరంగంలో ఫైటింగ్ కోసం వినియోగించారు. ప్రస్తుతం ఈ కర్రసామును ఏ సినిమాలో అంతగా చూపించడం లేదు. ఇప్పుడు మన ఆదాశర్మ ఏకంగా కర్రను 360 డిగ్రీలలో తిప్పేసింది.

మరి ఉలిపికట్టె లాగా ప్రవర్తిస్తున్న అదా శర్మ తీరు ఎలా ఉందంటే మారిషస్ దేశంలో ఒక బీచ్ లో చిట్టి నిక్కరు.. టీ షర్టు.. ఒక డెనిమ్ షర్ట్ వేసుకొని కర్రసాము చేస్తోంది.  ఆ కర్రను ఏరకంగా తిప్పుతోంది అంటే పాత టాలీవుడ్ సినిమాల్లో పది పదిహేను మంది రౌడీలు హీరో ని రౌండప్ చేస్తే హీరో కర్రసాము చేసి 360 డిగ్రీలలో కర్రను తిప్పుతూ వారి మక్కెలు విరగ్గొడతాడు కదా.. సరిగ్గా అలానే చేస్తోంది.  ఈ వీడియో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి ఒక పెద్ద క్యాప్షన్ ఇచ్చింది.

"కమాండో 3' సెప్టెంబర్ 6 న విడుదల అవుతోంది.  ఎవరైతే థియేటర్ కు పోకుండా ఉంటారో వారికి ఈ కర్ర దెబ్బలు తప్పవు.  ఈ కర్రసాము నేర్చుకునేందుకు చాలా టైమ్ పట్టింది. నాకాలికి గాయాల గుర్తులు ఉన్నాయి. తలకు కూడా గాయాలయ్యాయి. కానీ నెర్చుకున్నాను. సిలంబం(కర్రసాము మరో పేరు) వీడియోలను త్వరలో అప్లోడ్ చేస్తాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. అదా కర్రసాము సూపరో సూపర్.




javascript:;

మరింత సమాచారం తెలుసుకోండి: