తెలుగుదేశం పార్టీలో నందమూరి వంశం పాత్ర నామమాత్రమని అందరికీ తెలిసిందే. బాలయ్య జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే. అయిదేళ్ళ పాటు అధికారం చంద్రబాబు అనుభవించినా బావమరిదిని కనీసం మంత్రిగా తీసుకోలేకపోయారు. ఎమ్మెల్యేగా గెలవని కొడుకు లోకేష్ ని మాత్రం మంత్రిని చేసి పెద్ద బాధ్యతలు అప్పగించారు.


అయితే ఇపుడు పార్టీ ఓడింది. లోకేష్ కూడా ఓడారు. చంద్రబాబు అధికారం చేజారింది. మరి ఈ పరిస్థితుల్లో పార్టీని పైకి లేపాలంటే ఏం చేయాలి. ఇది బాబును పట్టుకున్న ధర్మ సందేహం. మరి బావమరిది బాలయ్యకు పార్టీలో పొజిషన్ ఏంటి అంటే జీరో అని చెప్పాలి.


పార్టీకి ఉప నాయకులు, విప్పులు అందరూ ఉన్నారు. బాలయ్య మాత్రం ఎమ్మెల్యేగానే ఉన్నారు. మరి చంద్రబాబు మంత్రాంగం ఇకనైనా చెల్లదని తేలిన నేపధ్యంలో అన్న గారి కుమారుడుగా ఉన్న బాలయ్యకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ వూపందుకుంటోంది. మరి బాబు గారు సరేనంటారా. 


మరింత సమాచారం తెలుసుకోండి: