రాజకీయ రంగంలో సినిమా రంగంలో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తులు చాల తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తులలో ఒకరైన జేసి దివాకర్ రెడ్డి చేసే కామెంట్స్ ఎప్పుడు  పెను ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంటాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు దేశం ఘోర పరాజయం తరువాత చాలారోజులు మౌనంగా ఉన్న జేసి దివాకర రెడ్డి తన మౌనం వీడి మాట్లాడటమే కాకుండా ఏకంగా ఫిలిం సెలెబ్రెటీల రాజకీయాల పై మాట్లాడాడు. ముఖ్యంగా టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరు చేస్తున్న డిమాండ్ పై జేసీ ఆసక్తికర కామెంట్స్ చేసారు. 

సినిమా వాళ్లకు ఉన్న పాపులారిటీ రీత్యా వాళ్ళు రాజకీయాలలోకి వస్తే ఏమి చేస్తారు అన్న ఆసక్తి చాలమందికి ఉంటుందని ఆ ఆసక్తితో జనం సినిమా స్టార్ లను చూడటానికి విపరీతంగా రోడ్డు పైకి వస్తారని చిరంజీవి పవన్ ల విషయంలో ఇది నిజం అయింది అంటూ జేసి కామెంట్స్ చేసారు. అయితే సినిమా స్టార్స్ ను చూడటానికి వచ్చిన వారు వారికి ఓట్లు వేయరనీ మరొకసారి పవన్ ఓటమితో రుజువైంది అన్న అభిప్రాయం వ్యక్త పరిచారు.

ఇలాంటి పరిస్థుతులలో చిరంజీవి పవన్ కళ్యాణ్ లు చేయలేని పని జూనియర్ ఎన్టీఆర్ ఏమి చేయగలరు అంటూ జేసీ ప్రశ్నలు వేస్తున్నారు. వాస్తవానికి తాను పవన్ కళ్యాణ్ ను రాజకీయాలలోకి వచ్చి కెరియర్ పాడు చేసుకోవద్దని సలహా ఇచ్చానని ఒక పార్టీని నడపడానికి ఇలాంటి పరిస్థుతులలో వేల కోట్లు కావాలనీ కేవలం వందల కోట్లు ఉండే పవన్ స్థాయి ఎక్కడ సరిపోతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు జేసి. అంతేకాదు చిరంజీవి పవన్ కళ్యాణ్ లకు కొరుకు పడని రాజకీయాలు కేవలం జూనియర్ రాకతో తెలుగుదేశం పార్టీకి  వోట్లు పడతాయి అనుకోవడం భ్రమ మాత్రమే అంటూ రాజకీయాలకు పనికి వచ్చే సమర్ధత పవన్ జూనియర్ లకు లేదు అంటూ వారి అనుభవ రాహిత్యం పార్టీలను నిలపలేదు అంటూ జేసి చేసిన కామెంట్స్ బట్టి భవిష్యత్ లో రాజకీయాలలోకి రావడానికి స్టార్స్ అందరు భయపడిపోతారు అన్నది వాస్తవం..  


మరింత సమాచారం తెలుసుకోండి: