అవును మరి ఎంతటి వారికైనా ఎక్కడో హద్దు ఉంటుంది. హద్దులు దాటితే అంతే మరి. రేణూ దేశాయ్ ని ఎవరైన డీసెంట్ యాక్టర్ అని ఒప్పుకోకతప్పదు. ఆమె పర్సన‌ల్ లైఫ్ లో కూడా అదె డీసెన్సీ మైంటైన్ చేస్తారు కూడా. ఇక తన బాధ్యతలు ఏంటో ఆమెకు బాగా తెలుసు. ఓ రెస్పాసిబిల్ సిటిజన్ గా ఉన్న రేణూని పదే పదే కవ్వించడం న్యాయమా.


ఆమె పవన్ కళ్యాణ్ మాజీ భార్య. అయితే పిల్లలు ఆమెకు మాజీ కారు కదా. తాజాగా రేణూ తన ఇద్దరు  పిల్లలతో కలిసిన ఫోటోల్ని పోస్ట్ చేశారు.  కొడుకు అకీరా.. కుమార్తెతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు.  ఆ ఫోటోకు ఒక వెబ్ సైట్ పవన్ కల్యాణ్ పిల్లలు.. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ తో అంటూ శీర్షిక పెట్టారు.


దీనిపై రేణు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా మండిపడ్డ ఆమె.. తన ఫేస్ బుక్ ఖాతాలో రెండు లైన్లలో ఊహించని రీతిలో వ్యాఖ్య చేశారు. ఇప్పుడే ఒకరు నాకిది పంపించారు.. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఇలా బాధ పెట్టకూడదు ఎప్పుడూ అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు.


 ఆ రైటప్ మీద ఆమెకు తీవ్ర అభ్యంతరకరంగా తోచటంతో ఇంత తీవ్రంగా స్పందించి ఉంటారని చెప్పొచ్చు. ఏమైనా.. రేణు ఇంత తీవ్రంగా రియాక్ట్ కావటం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. నిజానికి రేణూకి పిల్లలు ప్రాణం. ఆమె వేరే పెళ్ళి కూడా ఇప్పటికైతే చేసుకోలేదు. ఆమె పిల్లలు ఆమెకు మాజీలవుతారా. అందుకే ఇది అమ్మ ఆగ్రహం అని నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: