సప్తగిరి హీరోగా నటించిన  'వజ్ర కవచధర గోవింద' సినిమా ఇటీవల విడుదలైంది. డైరెక్టర్ అరుణ్ పవర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపించారు. ఈ నెల 14 న విడుదలైన ఈ సినిమా మొదటి నుండి మిశ్రమ స్పందన వచ్చినా కానీ సినిమా యూనిట్ ఎక్కడా కూడా తగ్గకుండా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతూ సినిమాను ఎలాగైనా లేపాలని చూస్తున్నారు.


ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ.. మొదటి రోజు మిక్డ్స్ టాక్ అన్నారు ఆ తర్వాత యావరేజ్ అంటున్నారు. యావరేజ్ టాక్ అనేది మా సినిమాకు కొండంత బలం. తప్పకుండా మా సినిమాను అంతా చూస్తారనే నమ్మకం ఉంది. కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చిన్న వాళ్లం.. మీ సపోర్ట్ ఉంటేనే ముందు ముందు మంచి సినిమాలు చేస్తాం.


చిన్నవాళ్లం అయిన మమ్ములను ఇప్పుడే తుంచేస్తే ముందుకు వెళ్లలేం. అందుకే మమ్ములను దయచేసి ప్రోత్సహించండి. స్కూల్స్, కాలేజీలో రీఓపెనింగ్ అయినా కానీ థియేటర్లలో 50శాతం థియేటర్లలో మంచి వసూళ్లు వస్తున్నాయని సప్తగిరి ఓవర్ కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: