కింగ్ నాగార్జున, సోనాలీ బింద్రే కలిసి నటించిన చిత్రం మన్మధుడు. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్. ఈ సినిమాకి కథ, మాటలను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఈ సినిమా 2002 లో విడుదలైంది. కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది.

 

మొన్న రిలీజైన టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ టీజర్ లో నాగార్జున పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. టీజర్ కి వచ్చిన స్పందన చూస్తుంటే ఈ సినిమా మీద ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.  ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ అంతా నాగార్జున ప్లేబాయ్ అవతారం గురించే.

 

అయితే తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే, మన్మధుడు 2 సినిమాలో చాలా వరకు హాలీవుడ్ షేడ్స్ కనిపిస్తున్నాయట. హాలీవుడ్ సినిమాల నుండి ప్రేరణ పొంది తీసి ఉంటారని అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలో మన్మధుడు సినిమా కూడా హాలీవుడ్ సినిమా అయిన " వాట్ వుమెన్ వాంట్" అనే సినిమా నుండి ప్రేరణ పొందిందే.

 

ప్రస్తుతం మన్మధుడు 2 సినిమా కూడా ఒక ఫ్రెంచ్ సినిమా అయిన "ఐ డు" నుండి ప్రేరణ పొందిందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఇది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అవుతే కాని చెప్పలేం. కేవలం టీజర్ చూసి ఈ సినిమా ఫలానా సినిమా లాగ ఉందని చెప్పడం కరెక్టు కాదు. కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చెయాల్సిందే.  ఈ సినిమాలో నాగార్జున కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. కీర్తి సురేష్, సమంత, అక్షర గౌడ ముఖ్య పాత్రదారులు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: