తమిళనాడు: ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్డియాక్ అరెస్ట్ తో మరో సారి హాస్పటిల్ లో చేరారు. చెన్నై గ్రీమ్స్ రోడ్ లోని అపోలో హాస్పటిల్ లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటుంన్నారు. అయితే ఆయన ఇలా హార్ట్ సంభంధిత సమస్య తో ఆస్పత్రిలో చేరటం మొదటి సారి కాదు, నాలుగోసారి. దాంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

 

మణిరత్నం తొలిసారిగా 2004లో హార్ట్ ఎటాక్ వచ్చింది. యువ చిత్రం సెట్స్ పై ఒత్తిడికి లోనై స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత 2015లో ఓకే బంగారం షూటింగ్ సమయంలో వచ్చింది.  మళ్లీ 2018లో మళ్లీ అదే సమస్య వచ్చింది. అయితే రొటీన్ చెకప్ కోసం హాస్పటిల్ కు వెళ్లాడని అక్కడున్న వైద్యులు చెప్పినా, అసలు నిజం ఇదే అని కొందరి వాదన.

 

లోకేష్ జే, చెన్నైకు సంబంధించిన ఓ మీడియా హౌస్ ప్రతినిధి ఈ విషయం ధృవీకరిస్తూ ఆయన మణిరత్నం కార్డియాక్ సమస్యలతో హాస్పటిల్ లో చేరాడని ట్వీట్ చేసారు. ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను, వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి, సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఒక భారీ  చిత్రానికి  సిద్ధం అవుతున్నారు.

 

అయితే మణిరత్నం కుటుంబం మాత్రం అలాంటిదేమి లేదని, ఆయన క్షేమంగానే వున్నారని చెప్పడం కొస మెరుపు.  ఓ రెండు రోజులు ఆగితే అసలు విషయం బయట పడుతుంది. ఎంజీఆర్, కమలహాసన్‌ వంటి దిగ్గజాలు నటించాలని ఆశపడ్డ ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కథను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతూండటంతో గత కొంతకాలంగా వార్తల్లో ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: