నార్త్ ఇండియాకు చెందిన తాప్సీ పన్ను ఎన్నో ఆశలతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన తాప్సి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కూడా ఆడిపాడింది. మీడియం రేంజ్ సినిమాల్లోనే ఎక్కువగా నటించిన తాప్సీకి స్టార్ హీరోల సరసన పెద్దగా ఛాన్సులు రాలేదు. ఆ తర్వాత ఆమె అటు బాలీవుడ్‌తో పాటు ఇటు కోలీవుడ్‌లోనూ అప్పుడప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 


తాజాగా ఆమె నటించిన గేమ్ ఓవర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే విమర్శకులు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సినిమాకు అంచనాలకు మించి వసూలు వస్తున్నాయి. ఇక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో తాను నటించేందుకు తాన్సీ చెప్పిన కారణం విని ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు. తాప్సీ కొద్ది రోజుల  క్రితం తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసిందట. క‌థ‌ బాగుండడంతో డీల్ ఓకే అయ్యిందట. కొద్ది రోజుల తర్వాత చిత్ర నిర్మాతలు ఆమె దగ్గరికి వచ్చి ఆ హీరోకు అంత మార్కెట్ లేదని సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాలంటే మీరు రెమ్యూన‌రేష‌న్ తగ్గించుకోవాలని చెప్పారట. దీంతో తాప్సీకి చిర్రెత్తుకు వచ్చినంత పనైందట.


హీరో మార్కెట్ తక్కువగా ఉంటే తన రెమ్యూనరేషన్ ఎలా తగ్గించుకుంటాను అని, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆమె ప్రశ్నిస్తోంది. ఈ విధానం మారాలనే తాను హీరోతో సంబంధం లేకుండా కథ అంతా తన చుట్టూనే తిరగాలని... ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తున్నానని చెప్పింది. తాప్సీ మాటలు ఎలా ఉన్నా ఇంత‌కు ఆ మార్కెట్ లేని టాలీవుడ్ హీరో ఎవరు ? అన్నదానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: