ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజై ఫ్లాపు అయినా, యావరేజ్ అయినా హిట్ కొట్టామనే అతిగా బిల్డప్ ఇస్తుంటారు దర్శక, నిర్మాతలు. కొందరు హీరోలు అయితే మా సినిమా బావుందని.. జనాలు చూస్తున్నారని, జనాలకు నచ్చిందని, రివ్యూ రాసే వాళ్ళకే నచ్చలేదని ఎదురు తిరిగే హీరోలు కూడా వున్నారు. అందరిలాగానే కమెడియన్ కమ్ హీరో సప్తగిరి కూడా గతంలో 'సప్తగిరి ఎల్ ఎల్ బి' టైమ్ లో సినిమా బావున్నప్పటికి, బాగా లేదని రివ్యూస్ ఇచ్చిన మీడియా విషయంలో కాస్త బాధపడ్డారు.  


అయితే ఈవారం సప్తగిరి లేటెస్ట్ సినిమా వజ్రకవచధర గోవింద సినిమా విడుదలయింది. ఆశించిన మేరకు టాక్ రాలేదు. ఇదే విషయాన్ని ఈ సినిమా సక్సెస్ మీట్ లో సప్తగిరి నిజాయితీగా ఒప్పుకున్నారు. సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిందని, తరువాత యావరేజ్ అన్న టాక్ స్థిరపడిందని, నలభై శాతం ఆక్యుపెన్సీ వుందని ఓపెన్ గా అంగీకరించారు. సినిమా బడ్జెట్ కు, మార్కెట్ కు ఆ ఆక్యపెన్సీ అన్నది సరిపోతుందని సంతోషపడ్డారు. 


ఇక ఈ సినిమా సెకండాఫ్ లాగ్ అయిందని కొందరు చెప్పారని,  అందుకు పది నిమషాలు ట్రిమ్మ్ చేస్తున్నామని అందరిముందు చెప్పాడు సప్తగిరి. చిన్నవాళ్లమని, తమ తప్పులు చూడకుండా, కాస్త ఆదరిస్తే ముందుకు వెళ్లగలమని, లేదంటే ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వుంటుందని సప్తగిరి మీడియా ద్వారా చెప్పడం విశేషం.   
సప్తగిరికి తన సినిమా పరిస్థితి క్లియర్ గా తెలియడం వేరు, కానీ ఓపెన్ గా ఒప్పుకుని మాట్లాడడం చూస్తుంటే, సప్తగిరి ఎల్ ఎల్ బి టైమ్ కు ఇప్పటికీ బాగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా వజ్రకవచధర..తో సప్తగిరి ఇంకాస్త  నిలదొక్కుకున్నట్టే కనిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: