కాజల్ అందగత్తె. సీనియర్ నటిగా లిస్ట్ లో చేరిపోయింది. వయసు ముప్పయి దాటినా పెళ్ళి ప్రస్తావన తేవడంలేదు. ఇంకా టాలీవుడ్లో ఏదో సాధిస్తానని అంటోంది. తనకు ఎన్నో టార్గెట్లు ఉన్నాయని చెప్పుకుంటోంది. తాజాగా మోడర్న్ సీతగా చేసి నటనలో మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు కొత్త ప్రాజెక్టులతో దూకుడు పెంచుతోంది.


ఇకపోతే కాజల్ తేజా డిస్కవరీ అన్న సంగతి తెలిసిందే. లక్ష్మీ కళ్యాణం మూవీ ద్వారా ఆమెను వెండితెరకు డైరెక్టర్ తేజా పరిచయం చేశారు. ఆ తరువాత టాప్ స్టార్స్ అందరితో నటించి స్టార్ ఇమేజ్ సాధించుకున కాజల్ తేజాకు అందని చందమామ అయింది. అయిఏ కెరీర్ డౌన్లో ఉన్నపుడు నేనే రాజు నేనే మంత్రి మూవీలో ఆమెకు చాన్స్ ఇచ్చి తేజా మళ్ళీ ట్రాక్ లో పెట్టాడు. తాజాగా వచ్చిన సీతలో కూడా కాజల్ నటనకు మంచి మారుకు వచ్చాయంటే తేజా టాలెంట్ కారణం.


ఇక కాజల్ తో  ఇపుడు మరో మూవీకి తేజా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇది కూడా మహిళలకు సంబంధించిన సబ్జక్ట్  ట. దీనికి కాజల్ మాత్రమే యాప్ట్ అంటున్నాడు తేజా. ఇక ఈ మూవీ ఈవ్ టీజింగ్ వంటి లేటెస్ట్ సంఘటలనతో సాగుతుందిట. ఈ మూవీకి ఓ స్పెషల్ కూడా ఉందిట. ఈ మూవీని కాజల్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఆమె నిర్మాత గా చేస్తున్న తొలి చిత్రం కూడా గురువు తేజా చేతిలో పెట్టడం విశేషం. మరి ఫస్ట్ హిట్ ఇచ్చి హీరోయిన్ని చేసిన తేజా ఇపుడు నిర్మాతగా కూడా సక్సెస్ ఇస్తారా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: