నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినందుకు తనకు హిందీ సినిమాలలో అవకాశాలు రాకపోవచ్చు అంటూ ఈమధ్య స్వయంగా ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఆ అనుమానాలు నిజం అయ్యేలోపు ఇప్పుడు కమెడియన్ పృథ్వీ పై మెగా ఫ్యామిలీ పరోక్షంగా బ్యాన్ పెట్టిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పృథ్వీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రచారం చేయడమే కాకుండా తన మాటల మధ్యలో పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా అతడి ‘జనసేన’ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి కామెంట్స్ సర్వసాధారణమే అయినా ఈ విషయాలను అల్లు అర్జున్ చాల సీరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనితో ప్రస్తుతం బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ నుండి పృథ్వీ పాత్రను తొలగించినట్లు టాక్. వాస్తవానికి ఈపాత్ర గురించి ఇప్పటికే త్రివిక్రమ్ పృథ్వీకి చెప్పడం ఆ పాత్రకు పృథ్వీ అంగీకారం పొందడం కూడా జరిగిపోయింది. అయితే అనూహ్యంగా ఈమూవీ స్క్రిప్ట్ లో వచ్చిన మార్పులు వల్ల పృథ్వీ పాత్రను తీసివేసామని త్రివిక్రమ్ టీమ్ సున్నితంగా పృథ్వీకి చెప్పినట్లు గాసిప్పుల హడావిడి చేస్తున్నాయి. 

అయితే ఇది అంతా స్క్రిప్ట్ లో వచ్చిన మార్పులు కావనీ బన్నీ సూచనతో జరిగిన మార్పులు అని అంటున్నారు. దీనితో మెగా హీరోల సినిమాలు అన్నింటిలోను ఇదే పద్ధతి అనుసరిస్తే బహుశా ఇక పృథ్వీ మెగా హీరోల సినిమాలలో కనిపించే ఆస్కారం ఉండకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో రానున్న రోజులలో మెగా హీరోలు అంతా పవన్ ‘జనసేన’ ను విమర్శించిన నటులతో ఇక నటించరా అన్న సందేహాలు కూడ మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలలో నిజాలు ఎన్నో తెలియకపోయినా ప్రస్తుతం ఈ న్యూస్ ఈ రోజు ట్రెండింగ్ న్యూస్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: