ఫిలిం ఇండస్ట్రీ సెలెబ్రెటీలతో పాటు బుల్లితెర సెలెబ్రెటీలకు కూడ రోడ్డు ప్రమాదాలు తప్పడం లేదు. ఇప్పుడు ఈ లిస్టులో ‘జబర్దస్త్’ చంటి కూడ చేరిపోయాడు. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చంటి ప్రయాణిస్తున్న కారుకు ఈరోజు ఉదయం తీవ్ర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 

సూర్యాపేట జిల్లాలో చంటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న చంటికి  తీవ్ర గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద చంటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. 

చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ఒక లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే గుమిగూడిన జనం చంటిని గుర్తుపట్టి వెంటనే అతడికి కోదాడ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ కు పంపించినట్లు తెలుస్తోంది. 

ఈరోజు ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా అందవలసి ఉంది. నిన్న శర్వానంద్ కు జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాలకు సుమారు 11 గంటల సర్జరీ జరిగి ఒక్క రోజు కూడ గడవకుండానే మళ్ళీ మరో సెలెబ్రెటీ ఇలా రోడ్డు ప్రమాదంలో చిక్కుకోవడంతో ఇండస్ట్రీని ఎదో ఒక నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: