ఈ మధ్య కాలంలో మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున,బలయ్య, మాస్ మహారాజా వంటి సీనియర్ స్టార్ హీరోలందరికీ ఎదురవుతున్న పెద్ద సమస్య వాళ్ళ పక్కన నటించే కరెక్ట్ హీరోయిన్స్ దొరకకపోవడం. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకు రెగ్యులర్‌గా ఇదే సమస్య ఎదురవుతోంది. కె. యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య కొత్త సినిమా ఈమధ్యే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గ్రాండ్‌గా ఓపెనింగ్ అయితే నిర్వహించారు కానీ హీరోయిన్ ను మాత్రం ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. అయితే ఈ సినిమాకు సీనియర్ బ్యూటీ శ్రియ శరణ్ ను ఎంపిక చేసినట్టు లేటెస్ట్ న్యూస్ వచ్చింది.  


బాలయ్యతో శ్రియ ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించింది. 'చెన్నకేశవరెడ్డి'.. 'గౌతమిపుత్ర శాతకర్ణి'.. 'పైసా వసూల్' సినిమాల్లో శ్రియ హీరోయిన్. అందుకే శ్రియ నటన.. ప్రొఫెషనలిజంపై బాలయ్యకు మంచి గురి ఉందట. అందుకే ఎక్కువ సెర్చ్ చేయకుండానే శ్రియను ఫైనలైజ్ చేశారని సమాచారం. ఇక కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట.  శ్రియ ఒక హీరోయిన్ కాబట్టి రెండవ హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట.


ఇక శ్రియ గత సంవత్సరం తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అదేంటోగాని పెళ్ళయినప్పటి నుంచి శ్రియకు టాలీవుడ్ లో ఆఫర్లు బాగా తగ్గాయి. తమిళంలో అయితే రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి కానీ తెలుగులో ఆఫర్లు లేవు.   టాలీవుడ్ లో పూర్తిగా ఫేడ్ అవుట్ అవుతున్న సమయంలో శ్రియకు బాలయ్య సినిమా ఆఫర్ జాక్ పాట్ లాంటిదే.


మరింత సమాచారం తెలుసుకోండి: