తన తొలి సినిమా గమ్యంతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు జాగర్లమూడి రాధాక్రిష్ణ. స్క్రీన్ నేమ్ " "క్రిష్" తో  సున్నితమైన కథల్ని అందంగా తెరకెక్కించే దర్శకుడు.  తెలుగులోనే బాలీవుడు లో కూడా  సినిమాలు తీశాడు. మొన్న వచ్చిన " మణికర్ణిక" క్రిష్ దర్శకత్వం వహించిందే. అయితే అ సినిమా దర్శకత్వ బాధ్యతల పట్ల ఎంత వివాదం జరిగిందో అందరికీ తెలిసిందే. పబ్లిగ్గా ఒకరి మీద ఒకరు  విమర్శలు చేసుకున్నారు.

 

బాలక్రిష్ణ 100 వ చిత్రం అయిన "గౌతమి పుత్ర శాతకర్ణి" కి క్రిష్ దర్శకత్వం వహించాడు. ఆ అనుబంధంతో  బాలక్రిష్ణ తన తండ్రి బయోపిక్  దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు.  "ఎన్టీఆర్  కథానాయకుడు" , ఎన్టీఆర్ మహానాయకుడు" అని రెండు భాగాలుగా విడుదలయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అప్పటినుండి ఇప్పటి వరకు క్రిష్ మళ్ళీ వార్తల్లో కనిపించలేదు.

 

తన తదుపరి చిత్రం ఏంటనేది ఇంతవరకుప్రకటించలేదు. క్రిష్ ఎప్పుడు ప్రకటిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయం పై ఆయన పెదవి విప్పినట్టు సమాచారం. క్రిష్ తన తదుపరి చిత్రాని కంటే ముందు ఇంకో ప్రాజెక్టు తీసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం ఆయన తన్ సొంత బ్యానర్ లో  ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట.

 

వెబ్ సిరీస్ కి సంబంధించి కథ, కథనం, మాటలు పూర్తి చేసి, దర్శకత్వ బాధ్యతలను వేరే వాళ్ళకి అప్పగించే పనిలో ఉన్నాడట.  తర్వాత తన తదుపరి సినిమా కోసం రంగంలోకి దిగితాడట.  ఎన్టీఆర్ బయోపిక్ తో నిరాశను మిగిల్చిన క్రిష్ తన తర్వాతి ప్రాజెక్టు తో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. ఇంకో చక్కని సున్నితమైన కథతో భావోద్వేగా పూరితమైన కథని ఎంచుకుంటాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: