అవును.  మీరు చదువుతున్నది నిజమే. రీసెంట్ గా బైపాస్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం రెస్ట్ తీసుకుని మళ్లీ బిజీ అవుతున్నారు.  ‘బ్రహ్మి ఈజ్ బ్యాక్!’ అనే  టైటిల్ తో రూపొందబోయే సినిమాలో బ్రహ్మానందం ప్రదాన పాత్రలో కనిపించబోతన్నారు.  రచయిత శ్రీధర్ సీపన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

 

ఇకపోతే ఈ సినిమాలో బ్రహ్మానందం రా ఏజెంట్‌గా కనిపించబోతున్నారట. బ్రహ్మానందం చేసే చేష్టలు ఫుల్ ఫన్ తో నిండి ఉంటాయంటున్నారు.  రా ఏజెంట్‌గా తెలుగు ప్రేక్షకులను బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అవతున్నారన్నమాట. తెలుగు ప్రేక్షకులకు ఇది బంపరాఫర్ అనుకోవచ్చు. ముఖ్యంగా బ్రహ్మీని కొంత కాలంగా మిస్ అయ్యాం మరి!

 

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా  పూర్తి కామెడీతో, పంచ్ డైలాగులతో , బ్రహ్మీ చేసే అల్లరి పనులతో ఆద్యంతం వినోదభరితంగా ఉంటుందని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలతో ఎనౌన్సమెంట్ రానుంది.

 

తెలుగులో అవకాశాలు తగ్గిన ఆయన, మలయాళ, తమిళ, కన్నడలో ఇటీవల నటించిన విషయం తెలిసినదే.  ఈ మధ్యనే విడుదలైన ఉపేంద్ర "ఐ లవ్ యు" ట్రైలర్ లో మనం అతనిని చూడవచ్చు. ఏదిఏమైనా, ఎంతమందొచ్చినా... ఆయన మార్క్, అండ్ టైమింగ్ వేరు.  అతని సాటి మరెవ్వరు రారనే చెప్పవచ్చు.  అన్నట్టు, హీరోగా చేయడం ఆయనికి కొత్తేమి కాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: