మీడియా వర్గాలెప్పుడు తన ప్రేమ విషయం గురించే మాట్లాడుతుంటాయని అంటున్నారు బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌. చాలా మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందుకు వెల్లడించడానికి ఒప్పుకోరు. కానీ కత్రినా మాత్రం ఎప్పుడు ఈ విషయం గురించి అడిగినా కాదనకుండా సమాధానమిచ్చారు. దీని గురించి ఓ విలేకరి ప్రశ్నించగా..

 

నా ప్రేమ విషయాలు మీకు (మీడియాకు) ఆసక్తి కదా.. అందుకే వాటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నా చెప్పకుండా తప్పించుకోలేకపోతున్నా. ఒకవేళ సమాధానం చెప్పకపోతే పొగరుగా ప్రవర్తించినట్లు అవుతుంది. అందుకే నేను ఎంత చెప్పగలనో అంత వెల్లడించేస్తున్నాను. అయితే నాకు, రణ్‌బీర్‌కు ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఇప్పటికీ అలాగే ఉంది.

 

అందులో ఏ సందేహం లేదు. నేను రణ్‌బీర్‌తో బ్రేకప్‌ అయినప్పుడు నా సోదరి కూడా ప్రేమలో విఫలమైంది. అప్పుడే నాకు తెలిసొచ్చింది నేను పబ్లిక్ ఫిగర్‌ని కాబట్టి తగిలిన గాయం మరింత బాధిస్తుందని. కానీ నేను, నా సోదరి అనుభవించిన బాధ మాత్రం ఒక్కటే. పుస్తకాలు చదువుతూ బాధ నుంచి తేరుకున్నాను. నా స్నేహితులు మద్దతుగా నిలిచారు. అయితే ఎందుకు విడిపోయామా? అన్న బాధ ఇప్పుడు లేదు’ అని వెల్లడించారు.

 

అవును, మన మీడియా మిత్రులు "చిట్టెలుక దూరే బొక్కలోనుండి, పందికొక్కుని పట్టుకోవాలని ఆశ పడుతూ వుంటారు."  కానీ మన కైట్స్ వాళ్ళకంటే తెలివైనది.  ఈమె ఏకంగా... దారమే దూరని కన్నం లోనుండి, పెద్ద త్రాచుపామునే లాగాలనుకుంటుంది.  అవునుమరి, ఎంతకాక పొతే, బాలీవుడ్లో ఇన్నేళ్లు నెంబర్ వన్ హీరోయిన్ గా మన్నగలుగుతుంది!


మరింత సమాచారం తెలుసుకోండి: