టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు..అందులో కొద్ది మంది మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేవారు ఉన్నారు.  అలాంటి మరుపురాని నటీమణి అనుష్క.  అందం..అభినయం ఉన్న అనుష్క మొదట గ్లామర్ పాత్రల్లో నటించినప్పటికీ..‘అరుంధతి’లాంటి సినిమా తర్వాత కేవలం నటనపై మాత్రమే ఫోకస్ పెట్టింది.  అప్పటి నుంచి ఆమె లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ అందరి మనసు దోచింది.  అరుంధతి, రుద్రమదేవి,సైజ్ జీరో తర్వాత ఆ మద్య భాగమతి సినిమా ఆమెకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి. 

బాహుబలి2 తర్వాత అనుష్క నటించిన మూవీ భాగమతి.  ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క ప్రస్తుతం ‘సైలెంట్’సినిమాలో నటిస్తుంది. తాజాగా అనుష్క కాలికి గాయమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ఆ మద్య 'సైరా' షూటింగ్ లో పాల్గొన్న ఆమె ఆ సమయంలో  నడవలేక బాగా ఇబ్బంది పడిందని సమాచారం.

ఈ షూటింగ్ పూర్తి కాగానే ఆమె ‘సైలెంట్’షూటింగ్ కి విరామం చెప్పినట్లు సమాచారం  అయితే అనుష్క కాలికి చిన్నగాయమే అయినా అది తీవ్రంగా ఇబ్బంది పెడుతుందట..డాక్టర్ల సూచన మేరకు ఆమె కొంత కాలం షూటింగ్ కి విరామం చెప్పాల్సి వచ్చిందట. కాగా, అనుష్కకు చిన్న గాయమే కాబట్టి విషయాన్ని బయటకి రానివ్వకుండా అనుష్క జాగ్రత్తలు తీసుకుంటుందట. కానీ ఈ విషయం సోషల్ మీడియాలో లీక్ కావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: