ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్లో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. గత రెండు సంవత్సరాలుగా ఈచిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ నటించిన సినిమా అవ్వడంతో సాహోపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 

ఇంతటి అంచనాలున్న సినిమా అవ్వడం కారణంగా నిర్మాతలు వంశీ మరియు ప్రమోద్లు ఎక్కడ రాజీ పడకుండా ఏకంగా 300 కోట్ల బడ్జెట్ను పెట్టినట్లుగా తెలుస్తోంది. ఒక యాక్షన్ సీన్కు ఏకంగా 90 కోట్ల వరకు ఖర్చు పెట్టినుట్లగా అప్పుడు వార్తలు వచ్చాయి. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్తో పాటు ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. అందుకే ఈ చిత్రం బడ్జెట్ ఎక్కువ అయ్యింది.

 

ఒక తెలుగు సినిమా ఇంత బడ్జెట్ను రాబట్టగలదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేశారు. ఏమాత్రం అనుభవం లేని దర్శకుడికి 300 కోట్ల సినిమాను ఇస్తారా అంటూ కొందరు విమర్శలు చేశారు. అయితే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 250 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. ఇక డబ్బింగ్ రైట్స్ మరియు శాటిలైట్ ప్రైమ్ వీడియో రైట్స్ ద్వారా మరో 150 కోట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. అంటే సినిమా 400 కోట్లను విడుదలకు ముందే రాబట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: