‘సాహో’ టీజర్ విద్వంసంతో ఇప్పటి వరకు ఈసినిమాను ఒక తెలుగు డబ్బింగ్ సినిమాగా మాత్రమే అనుకున్నా బాలీవుడ్ కోలీవుడ్ హీరోల ఆలోచనలలో ఇప్పుడు మార్పులు వస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఆగష్టు 15న ‘సాహో’ ని కార్నర్ చేస్తూ విడుదలకు రెడీ అవుతున్న కొన్ని భారీ సినిమాలు ఇప్పటికే ఇండిపెండెన్స్ డే రేస్ నుండి తప్పుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. 

ముఖ్యంగా తమిళ టాప్ హీరో అజిత్ నటించిన బాలీవుడ్ మూవీ ‘పింక్’ తమిళ రీమేక్ ‘నెర్కొండ పరావి’ ‘సాహో’ తో పోటీగా ఆగష్టు 15న కాకుండా రెండు వారాలు గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ లో విడుదల చేయమని స్వయంగా అజిత్ నిర్మాతలకు సూచనలు ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగల్’ మూవీని కూడ ఆగష్టు 15న ‘సాహో’ తో పోటీగా కాకుండా వేరే డేట్ కు విడుదల చేస్తే బాగుంటుందని ఆమూవీ నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

అంతేకాదు మళయాళ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆగష్టు 15ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న సినిమాలు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ విడుదల చేయాలి అని భావిస్తున్న ఇండిపెండెన్స్ డే రేస్ సినిమాలు కూడ వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఒక తెలుగు హీరో సినిమాకు భయపడి కోలీవుడ్ బాలీవుడ్ హీరోలతో పాటు మలయాళ కన్నడ ఇండస్ట్రీ సినిమాల డేట్స్ మారిపోతున్నాయి అని వార్తలు రావడం ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఈవార్తలే నిజం అయితే ‘సాహో’ ఓపెనింగ్ డే కలక్షన్స్ 200 కోట్లు స్థాయిలో ఉన్నా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అయితే ఇంత హడావిడి జరుగుతున్నా ‘సాహో’ మ్యానియా గురించి ఏమాత్రం భయం లేకుండా నాగార్జున తన ‘మన్మధుడు 2’ రిలీజ్ డేట్ ను ఆగష్టు 8కి కొనసాగిస్తూనే ఉండటం మాత్రం ప్రస్తుతానికి షాకింగ్ న్యూస్ గా కొనసాగుతూ అజిత్ అక్షయ్ కుమార్ చేయలేని సాహసం నాగార్జున చేస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: