బిగ్ బాస్ తెలుగులో ఎన్ని షోలు వచ్చినా ఈ షో కొంచెం ప్రత్యేకం. తెలుగులో యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐన తారక్ ఈ షో మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించడంతో ఈ షోపై జనాల్లో ఆసక్తి ఏర్పడింది. తమకు ఇష్టమైన సెలబ్రిటీలు షోలో కొన్ని వారాల పాటు ఉండటం, బిగ్ బాస్ ప్రతి రోజూ ఇచ్చే టాస్క్, షోలో సెలబ్రిటీలు చేసే పనులు ఈ షోను సూపర్ హిట్ చేసాయి. 
 
వీకెండ్లో బిగ్ బాస్ షో అంచనాలకు మించి టీఆర్పీ అందుకుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 2 కు ఎన్టీయార్ నో చెప్పటంతో నాని హోస్ట్గా వ్యవహరించారు. కానీ మొదటి సీజన్ రేంజ్లో సీజన్ 2 హిట్టు కాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 3కు నాగార్జున హోస్ట్గా వ్యవహరించబోతున్నాడు. సెలబ్రిటీల ఎంపికలో కూడా ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 
 
తెలుగు బిగ్ బాస్ షోకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయిన తమిళ బిగ్ బాస్ మాత్రం ఇబ్బందుల్లో పడింది. ఈ షో ఆపేయాలని కోర్టులో పిటిషన్ నమోదైంది. కమల్ హాసన్ తమిళంలో ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సెలబ్రిటీలు ఉపయోగించే దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని పిటిషన్లో తెలిపారు. కోర్టు తీర్పు వచ్చేదాకా బిగ్ బాస్ 3 తమిళంలో మాత్రం ఇబ్బందుల్లో పడ్డట్లే. 



మరింత సమాచారం తెలుసుకోండి: