టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా హర్రర్, కామెడీ మూవీల ట్రెండ్ నడుస్తుంది.  ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు బాగా వస్తున్నాయి. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో దెయ్యంగా నటించిన నందిత శ్వేత ఆ తరహా సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది.  తాజాగా నందిత శ్వేత ముఖ్య పాత్రలో బి.చిన్నికృష్ణ దర్శకత్వం వహించిన ‘అక్షర’మూవీ  ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అక్షర' సిద్ధమవుతోంది.


అజయ్ ఘోష్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. ఈ మూవీలో నందితా శ్వేత టీచర్ గా నటిస్తుంది..ఆమెను చంపేయాలని కిడ్నాప్ చేస్తారు.  పెద్ద వయసు కలిగిన అజయ్ ఘోష్ తో ఏ పనిపాట లేని ముగ్గురు వ్యక్తులు పరిచయం అయిన తర్వాత డబ్బు కోసం ఏ పనిచేశారు..ఎందుక కిడ్నాప్ చేశారు,  ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే సినిమా కాన్సెప్ట్ అని తెలుస్తుంది. అక్షర మూవీలో ఓ వైపు సస్పెన్స్ కొనసాగిస్తూనే కామెడీ చూపిస్తున్నారు. 

ఈ మూవీలో షకలక శంకర్, మదు నందన్, సత్య ముఖ్య భూమిక పోషించారు.  వారు చేసే కామెడీకి థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారని చిత్ర యూనిట్ తెలిపింది.  త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: