పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ టాప్ హీరో. తిరుగులేని ఇమేజ్ ఆయన సొంతం. పవన్ ఫ్యాన్స్ హిట్లు తో సంబంధం లేకుండా ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటారు. అటువంటి పవన్ జనసేన  పేరుతో రాజకీయాల్లోకి వచ్చేశారు. ఎంతో గ్లామర్ ఉండగానే ఈ వైపు దూకారు. రాజకీయాల్లో తాను ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. అయితే పోటీ చేసిన రెండు సీట్లలో ఘోరంగా ఓటమి పాలు కావడంతో పవన్ ఇపుడు క్రాస్ రోడ్స్ లో ఉన్నాడు.


ఇక లేటెస్ట్ గా వచ్చిన టాక్ ఏంటి అంటే పవన్ మళ్ళీ రంగుల ప్రపంచంలోకి   వెళ్తాడని, గతంలోలా మూవీస్ చేస్తూ వెలిగిపోతాడని, పవన్ కోసం ఇప్పటికీ నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆయన కూడా కొంతమంది ప్రొడ్యూసర్ల మొత్తలను తన దగ్గర అడ్వాన్స్ గా ఉంచుకున్నాడు. దాంతో పవన్ సినిమాల వైపు రావడం ఖాయం అంటున్నారు.


ఇక తాజాగా పవన్‌ న్యూ లుక్‌ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎన్నికల ముందు వరకు తెల్ల పంచె, తెల్ల లాల్చీలో కనిపించిన పవన్‌ తరువాత జీన్స్‌ టీషర్ట్స్‌లోకి మారిపోయాడు. తాజాగా గెడ్డం కూడా ట్రిమ్‌ చేసి స్టైలిష్ లుక్‌లోకి వచ్చేశాడు. జీన్స్‌, కలర్‌ఫుల్‌ షర్ట్‌లో సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి సిద్ధమైనట్టుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పవన్‌ త్వరలోనే సినిమాల్లో నటించటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. మరి ఆ ముచ్చట తొందరలో తీరుతుందా.. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: