సమంత ‘ఓ బేబి’ ట్రైలర్ లో అడల్ట్ టచ్ డైలాగ్ లు వినిపించడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి ఈ ట్రైలర్ చూసిన వారికి ఒక ఫ్యాంటసీ సినిమాను చూడబోతున్నాము అన్న సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ‘డెభై ఏళ్ల బామ్మ పాతికేళ్ల అమ్మాయిలా ఎలా మారింది’ అని వస్తున్న సందేహాలకు క్లారిటీ ఇస్తూ ఒక రాత్రివేళ మెరిసిన మెరుపు బామ్మను బేబీగా ఎలా మార్చింది అన్న క్లారిటీ ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.

అయితే అనూహ్యంగా ఈ ట్రైలర్ లో డబల్ మీనింగ్ డైలాగులు వినిపించడంతో సమంత అడల్ట్ కంటెంట్ ను నమ్ముకుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ ట్రైలర్ లోని ఒక సీన్ లో మంచి హస్బెండ్ అంటే ఎలా ఉండాలి అన్న విషయమై మాట్లాడుతూ ‘చూడటానికి అందంగా ఉండాలి, నేను ఏం కొనుక్కోవాలనుకున్నా వాడి దగ్గర సరిపడా డబ్బులు ఉండాలి, మంచం ఎక్కితే మగాడిలా కాపురం చేయాలి' అంటూ సమాధానం ఇస్తుంది. 

ప్రస్తుతం ఈ డైలాగ్ కు అందరు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కొద్దిరోజుల క్రితం విడుదలైన నాగార్జున ‘మన్మధుడు 2’ టీజర్ లోని డైలాగులను సమంత ‘ఓ బేబి’ టీజర్ డైలాగ్ లతో పోలుస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

‘మన్మధుడు 2’ టీజర్ లో అడల్ట్ కంటెంట్ డైలాగ్స్ ఉన్నట్లుగానే సమంత ‘ఓ బేబి’ లో కూడ అడల్ట్ కంటెంట్ డైలాగ్ లు వినిపించడంతో మామ కోడళ్ళు ఇద్దరూ తమ సినిమాలకు సంబంధించి అడల్ట్ కంటెంట్ ను ఎంచుకున్నారా అంటూ సెటైర్లు పడుతున్నాయి. అంతేకాదు కోడలు సమంత జూలై లో తన సినిమాతో వస్తుంటే మావ నాగార్జున ఆగష్టులో వస్తూ ఇద్దరూ ఒకే మార్గాన్ని అనుసరిస్తూ అడల్ట్ కంటెంట్ పై ఆధారపడటం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: