'నా ఆలోచన' పేరుతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన కామెంట్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. అయితే కొందరు తనను దారుణంగా ట్రోల్ చేయడంతో తమ్మారెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

 

తమ్మారెడ్డి గారు పవన్ కళ్యాణ్ పై ఒక వీడియో పెడితే, ఆ వీడియో పై పవన్ అభిమానులు కోపగించుకున్నారు. మీరు యూట్యూబ్ లో ఉండడం కాదు. బయటకొచ్చి మాట్లాడండి అంటూ విమర్శించారు. దానికి తమ్మారెడ్డి తాను యూట్యూబ్ లోనే ఉండటం లేదని, ప్రజల్లో ఉండి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నానని అన్నారు.

 

ట్రోలింగ్ ఎప్పుడూ ఆత్మ విమర్శ చేసుకునేదిగా ఉండాలని, ప్రతో ఒక్కర్లో తప్పులుంటాయని, నా తప్పుల గురించి చెబితే అర్థం చేసుకుంటానని అన్నారు.నేను చెప్పే ఏ వీడియోలో అయినా ఇది నా ఆలోచన అన్నాను కానీ... మీ ఆలోచన అనలేదుకదా. మీకు ఇంకేమైనా ఆలోచన ఉంటే నాకు చెప్పండి, నేను కూడా దాని గురించి ఆలోచిస్తాను. అంతే కానీ రోడ్డు మీదకు రా, పక్కకు వెళ్లు, మా వాళ్లను అనడానికి నువ్వు ఎవరు? అనడం కరెక్ట్ కాదు అన్నాడు. ప్రజాస్వామ్యంలో ఉంటున్నందుకు ఎవరినైనా అనొచ్చని చెప్పాడు.

 

మీరు చేస్తున్న పనికిరాని ట్రోలింగ్ వల్ల మీలో నెగెటివిటీ పెరుగుతోంది. మీ లాంటి వారు ఏ నాయకుడిని సపోర్టు చేసినా ఆ నాయకుడికి కూడా నెగెటివిటీ వెళుతుంది. వారి నాయకత్వం కూడా మీ దెబ్బ వల్ల నాశనం అవుతుంది. మీరు ఇలా నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం వల్లే చాలా మంది నాయకులు ఓడి పోయారని తమ్మారెడ్డి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: