టాలీవుడ్ లో టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునలు ఉంటారు.  ఇద్దరికీ భారీ ఫాలోయింగ్ ఉన్నది.  మెగాస్టార్ కు మాస్ హీరోగా పేరు ఉంటె.. నాగార్జునకు క్లాస్ హీరోగా పేరు ఉన్నది.  ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు.  


ఎందుకో ఏంటో తెలియదు.  బహుశా అప్పట్లో కుదరకపోయి ఉండొచ్చు.  ఒక్కసారైనా ఇద్దరు కలిసి నటిస్తే బాగుంటుంది కదా.  అప్పట్లో కాంపిటీషన్ కారణంగా వాటిని పక్కన పెట్టారు.  ఇప్పుడు యువ హీరోలు దూసుకుపోతున్నారు.  ఈ యువ హీరోలు దూసుకుపోతున్న తరుణంలో ఇద్దరు కలిసి నటిస్తే బాగుంటుంది కదా.  


మల్టీస్టారర్ సినిమాలు చాలా వస్తున్నాయి.  యువ హీరోలు కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  సీనియర్ హీరోలు, యువ హీరోలతో కలిసి నటిస్తున్నారు.  రామ్ చరణ్.. ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్నారు.  అలానే వెంకటేష్... వరుణ్ తేజ్, వెంకటేష్... నాగచైతన్యలు కలిసి నటించారు.  


అలాగే ఒకప్పటి టాప్ హీరోలైన చిరంజీవి.. నాగార్జున, బాలకృష్ణ .. వెంకటేష్ లు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేస్తే బాగుంటుంది కదా.  ఈ నలుగురు ఎప్పటికి ఎవర్ గ్రీన్ హీరోలు కాబట్టి మల్టీస్టార్ హీరోలుగా చేస్తే.. మంచి డిమాండ్ ఉంటుంది.  సినిమా ఇండస్ట్రీకి కొత్త కళ వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: