తమిళ స్టార్ హీరో విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి బాహుబలి నిర్మాతలు షాకిచ్చారు. ఆయన నటించిన సింధుబాద్ సినిమా రిలీజ్‌ కాకుండా ఆర్కా మీడియా వర్క్స్ కోర్టు నుంచి నోటీసులు పంపింది. వాస్తవానికి సింధ్‌బాద్ చిత్రం జూన్ 21న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే కోర్టు స్టే విధించడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఈ సినిమా నిర్మాత రాజరాజన్ కి బాహుబలి నిర్మాతలకి మధ్య జగిన వివాదమే దీనికి కారణం.

 

బాహుబలి సినిమాను తమిళనాడులో సింధ్‌బాద్ నిర్మాత రాజరాజన్ విడుదల చేశాడు. ఆ సినిమా హక్కులను కే ప్రొడక్షన్స్ సొంతం చేసుకొన్నది. అయితే భారీ విజయం సాధించినప్పటికీ వసూళ్లకు సంబంధించిన మొత్తాన్ని సెటిల్‌ చేయకపోవడంతో వివాదం చోటుచేసుకొన్నది. దాంతో శోభూ యార్లగడ్డ, ప్రసాద్ కోర్టును ఆశ్రయించారు.  సెటిల్ చేసేంత వరకు సినిమా విడుదల చేయనివ్వద్దని కోరారు.

 

బాహుబలి చిత్రానికి సంబంధించిన తమిళ థియేట్రికల్ హక్కులను రూ.28 కోట్లకు రాజరాజన్ కొనుగోలు చేశారు. ఆ మొత్తంలో ఇంకా రూ.12.5 కోట్లు చెల్లించాల్సి ఉంది. పలుమార్లు చర్చలు జరిపి, రిక్వెస్ట్ చేసినప్పటకీ ఇవ్వకుండా ఉండటంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శోభు, ప్రసాద్ పిటిషన్ పరిశీలించిన అనంతరం బాహుబలి నిర్మాతలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చేంత వరకు సింధ్‌బాద్ సినిమా రిలీజ్ వాయిదా వేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

విజయ్ సేతుపతి నటించిన సింధ్‌బాద్ సినిమాకు పాన్నైయారమ్ పాడిమినియమ్ దర్శకుడు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఎస్ఎన్ రాజరాజన్, షాన్ సుథారన్ నిర్మించారు. కే ప్రొడక్షన్స్, వాసన్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో అంజలి, వివేక్ ప్రసన్న తదితరులు నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: