గత వారం చిన్న సినిమాగా విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’ కు ఊహించని మంచి టాక్ రావడమే కాకుండా ఈమూవీ కలక్షన్స్ కూడ చాల బాగున్నాయి అని వార్తలు వస్తున్నాయి. నవీన్ పోలి శెట్టి అన్న తెలుగు అబ్బాయి ముంబాయి నుండి దిగుమతి అయి ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి మరొక కొత్త హీరోగా మారి విజయాన్ని అందుకున్నాడు.

అయితే ఈ సినిమా సక్సస్ నానీకి ఊహించని తలపోటుగా మారింది అని వార్తలు వస్తున్నాయి. నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న గ్యాంగ్ లీడర్ మూవీ కథలోని ట్విస్ట్ లు  ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’  మూవీలోని ట్విస్ట్ లతో పోలి ఉంటాయని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇలా మూలకథలో పోలికలు రావడానికి గల కారణం ఈ రెండు సినిమాల మూలకథ ఒక హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ పొందింది అని వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం నాని ‘గ్యాంగ్ లీడర్’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఒక యంగ్ అసిస్టెంట్ ఈమధ్య ‘ఏజెంట్ సాయి శ్ర్రేనివాస ఆత్రేయ’ మూవీ చూసి ఆ మూవీ స్టోరీలో వచ్చిన ట్విస్ట్ లు అన్నీ ‘గ్యాంగ్ లీడర్’ మూవీలోని చాల సీన్స్ తో పోలి ఉన్న విషయాన్ని నానీకి దర్శకుడు విక్రమ్ కుమార్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్. దీనితో ఎలర్ట్ అయిన నాని విక్రమ్ కుమార్ లు ఈమూవీని ఈ వారంలో చూసి ‘గ్యాంగ్ లీడర్’ సీన్స్ విషయంలో ఏమైనా మార్పులు చేయాల అన్న ఆలోచనలు చేయబోతున్నట్లు టాక్. 

వాస్తవానికి ‘గ్యాంగ్ లీడర్ షూటింగ్ అంతా పూర్తి అయి విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థుతులలో మళ్ళీ సీన్స్ మార్చి రీషూట్ చేయాలి అంటే చాల సమయం పడుతుంది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఒక చిన్న సినిమా నానీకి చుక్కలు చూపించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: