సినిమాలు చేసినన్ని రోజులు హీరో పాత్రలు తప్ప మరో పాత్రలు చేయలేదు శోభన్ బాబు గారు. పాత్ర ఎటువంటిదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తారు. అయితే ఆయన సినిమాలు మానేసిన దగ్గరినుండి చనిపోయే వరకు ఒక్కసారి కూడా సినిమా ఫంక్షన్ లో కనబడలేదు. అసలు ఇంటర్వ్యూ కూడాఇవ్వలేదు. చాలా మందికి ఆయన సినిమాల్లో కాకుండా బయట ఎలా ఉంటారనేది తెలియదు. సినిమాలు వద్దనుకున్న తర్వాత సినిమా వాళ్ళను కూడా కలవలేదట.

 

అయితే శోభన్ బాబు గారికి సన్నిహితుడైన మురళీ మోహన్ గారు శోభన్ బాబు గారి గురించి తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. శోభన్ బాబు గారికి ముందుచూపు ఎక్కువని, భవిష్యత్ లో దేనిపై బిజినెస్ చేస్తే లాభం ఉంటుందో చాలా కరెక్టుగా చెప్పేవారని అన్నారు. అందుకని స్థలాల కొనుగోలు మీద దృష్టి పెట్టారని  అన్నారు.

 

 తన కెరియర్ ను గురించి ప్రస్తావిస్తూ, వ్యాపార వ్యవహారాల్లో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నదీ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగానంటూ శోభన్ బాబు గురించి ఇలా చెప్పుకొచ్చారు."శోభన్ బాబుగారితో నాకు మంచి సాన్నిహిత్యం వుంది. ఆయనకి చాలా ముందుచూపు ఎక్కువ. డబ్బు విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వుండేవారు. తన చేతికి వచ్చిన ప్రతి రూపాయిని స్థలాలపై పెట్టారు. తనకి ఎక్కడ నచ్చితే అక్కడ స్థలాలు కొనేశారు.

 

ఆ రోజుల్లో ఆయన ఎకరం 5 వేలకి కొంటే ఆ తరువాత ఎకరం 50 కోట్లకి పెరిగింది. అలా ఆయన చెన్నై పరిసర ప్రాంతాల్లో ఎన్నేసి స్థలాలు కొన్నారో లెక్కేలేదు. ఒక విధంగా చెప్పాలంటే, భారత దేశంలోని సినిమా ఆర్టిస్టులందరిలోకి అత్యంత ధనికుడు ఎవరంటే శోభన్ బాబేనని చెప్పాలి" అన్నారు.  ఆయన ముందు చూపు అంతటి స్థానంలో ఉంచిందని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: